పదహారేళ్ళ ప్రాయంలోనే వెండితెరను పలకరించింది అసిన్ .తాను కేవలం అందంతో నెట్టుకొచ్చే తరహా అమ్మాయి కాదని, తనలోని ప్రతిభను నమ్ముకుని దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
కెరీర్ సాఫీగా సాగుతున్న తరుణంలో బాలివుడ్ తలుపు తట్టింది .అది కుడా చిన్నాచితక అవకాశం కాదు.బాలివుడ్ బాక్సాఫీస్ ని పరుగులు పెట్టించే అమీర్ ఖాన్ సరసన అవకాశం.ఊహించినట్టుగానే తొలి హిందీ చిత్రం గజినీ అప్పటివరకున్న రికార్డులన్నీ తిరగరాసింది.అసిన్ రాత్రికి రాత్రే స్టార్ అయిపొయింది.
ఇంతకుముందు ఏ కొత్త ముఖం కుడా ఇంత ఆర్భాటంగా కెరీర్ ప్రారంభించలేదు.
చేసిన 6 చిత్రాల్లో 5 సూపర్ హిట్లు ఉన్నపటికీ అసిన్ కెరీర్ లో ఆశించినంత ఎత్తుకు ఎదగలేకపోయింది.దీనికి కారణం అసిన్ తండ్రి అంటారు హిందీ సినీ పండితులు.
ఆయన ప్రాభవంతో నిర్ణయాలు తీసుకున్న అసిన్ ఆమీర్,సల్మాన్ ఇచ్చిన బలాన్ని ఉపయోగించుకోలేకపోయింది.
పాపం అసిన్ ! ఇప్పుడు సినిమాలు లేక పెళ్ళికి రెడీ అయిపొయింది.