ఇండియాలో లాక్‌డౌన్‌పై డబ్ల్యూహెచ్‌ఓ స్పందన  

Who Reaction About India Lock Down - Telugu Corona Positives, Corona Virus, India, India Lock Down, India Narendra Modi, Narendra Modi, Who

ఇండియా వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెల్సిందే.అమెరికాతో పాటు కొన్ని దేశాలు కరోనా విజృంభిస్తున్నా కూడా లాక్‌డౌన్‌ను విధించేందుకు సిద్దం కావడం లేదు.

 Who Reaction About India Lock Down

ఆర్థికంగా దేశం కుప్పకూలిపోతుందనే ఉద్దేశ్యంతో ఆయా దేశాలు లాక్‌డౌన్‌కు సిద్దం అవ్వడం లేదు.కాని మోడీ మాత్రం కరోనా ప్రధమ స్థాయిలో ఉన్న సమయంలో లాక్‌ డౌన్‌ను ప్రకటించి మంచి పని చేశారంటూ అంతా అభినందిస్తూ ఉన్నారు.

జనాలు కాస్త ఇబ్బందులకు గురి అవుతున్నా కూడా లాక్‌ డౌన్‌ అనేది మంచిదే అంటున్నారు.

ఇండియాలో లాక్‌డౌన్‌పై డబ్ల్యూహెచ్‌ఓ స్పందన-General-Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా లాక్‌ డౌన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది.

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇండియన్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం.వారు చేస్తున్న ప్రయత్నాలతో కరోనాను చాలా బాగా కట్టడి చేస్తున్నారు.

వారు తీసుకున్న లాక్‌ డౌన్‌ నిర్ణయం చాలా గొప్పది.అన్ని దేశాలు కూడా అలాగే లాక్‌ డౌన్‌ను ముందే విధించి ఉంటే పాజిటివ్‌ల సంఖ్య ఈ స్థాయిలో పెరిగి ఉండేది కాదేమో అంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇండియాలో కరోనా వ్యాప్తికి సంబంధిన విషయాలను ప్రధాని మోడీతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లుగా వారు చెప్పారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..