వెరైటీ వస్త్రధారణతో క్రికెట్ ఆడిన వేద పండితుడు.. ఫలితంగా ఏ బహుమతి ఇచ్చారంటే..?

సాధారణంగా మనం చూసే క్రికెటర్లు ఒంటికి రకరకాల జెర్సీలు ధరించి, కాళ్లకు ఖరీదైన షూస్ లు, తలకు క్యాప్ పెట్టుకుని, కళ్లకు కూలింగ్ గ్లాసెస్ ధరించి చూడడానికి భలే ఉంటారు.అవన్నీ దరిస్తేనే క్రికెట్ అంటాము కదా.

 Who Played Cricket In Variety Attire What Is The Reward Given As A Result , Vir-TeluguStop.com

మనం గల్లీలో ఆడే ఆటల్లో కూడా ప్యాంటు, షర్ట్ ధరించే క్రికెట్ ఆట ఆడతాము.మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో నిర్వహిస్తున్న ఓ టోర్నీలో మాత్రం క్రికెటర్లు వెరైటీగా ధోతి, కుర్తా పైజామా ధరించి ఆట ఆడడానికి బరిలో దిగారు.

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారేమి పెద్ద ప్రొఫెషనల్ క్రికెటర్లు కాదు.వేదాలు పటించే వేద పండితులు అవ్వడం గమనార్హం.

నిత్యం పూజలు, మంత్రాలు చదివే వేద పండితులు ఇలా బాలు, బ్యాట్ పట్టి క్రికెట్ ఆడడమేంటి.? అని షాక్ అవుతున్నారా.? అసలు వివరాల్లోకి వెళితే.ప్రముఖ యోగా గురువు అయిన మహర్షి మహేష్  యోగి జయంతిని పురస్కరించుకుని భోపాల్‌లో వేద పండితులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.

సంస్కృత్ బచావో మంచ్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ టోర్నీలో ఆడే ఆటగాళ్లకు ధోతీ కుర్తా డ్రెస్ కోడ్‌గా నిర్ణయించడంతో వారు ఆ వస్త్రధారణ తో మైదానంలో ఆట ఆడారు.

మొత్తం నాలుగు రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది.అలాగే ఈ టోర్నమెంట్ లో ప్రాచీన సంస్కృత భాషలో కామెంటరీ చెప్పడంతో పాటు,మ్యాచ్ ఆడే ఆటగాళ్లందరూ సంస్కృతంలోనే మాట్లాడడం జరిగింది.

అలాగే నాలుగు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్ లలో ప్రతి మ్యాచ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు.అయితే ఆ బహుమతులు కూడా పండితులకు పనికి వచ్చేవే అవ్వడం విశేషం.

అవి ఏంటంటే వేద పుస్తకాలు, 100 సంవత్సరాల పంచాంగాలను బహూకరిస్తున్నారు.ప్రస్తుతం ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి.

నెటిజన్లు కూడా ఈ మ్యాచ్ ను బాగా లైక్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube