చైనా పని పట్టడానికి రంగం లోకి దిగుతున్న డబ్ల్యూహెచ్ఓ అధికారులు..!!  

china,WHO,Corona virus,Lock down - Telugu China, Corona Virus, Lock Down, Who

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా అని అందరికీ తెలుసు.2019 వ సంవత్సరంలో చైనా దేశంలో నవంబర్ నెలలో బయటపడిన ఈ వైరస్ కేవలం కొద్ది నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అనేక దేశాల ఆర్థిక పరిస్థితులను తల్లకిందులు చేసింది.ఆర్థికంగా మాత్రమేకాక చాలా దేశాలలో ప్రాణ నష్టం కూడా జరిగింది.ఈ నేపథ్యంలో చైనా కావాలని ఈ వైరస్ ని ప్రపంచం లోకి వ్యాప్తి చేసే విధంగా వ్యవహరించిందని అప్పట్లో అనేక దేశాలు ఆరోపించడం అందరికీ తెలిసిందే.

ఇటువంటి తరుణంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధికారులు అసలు వైరస్ ఎలా చైనాలో పుట్టిందో తెలుసుకోవటానికి రంగంలోకి దిగారు.పదిమంది నిపుణులతో కూడిన ఈ బృందం చైనాలో వైరస్ బాగా వ్యాప్తి చెందిన అదేవిధంగా ప్రభావం చూపిన ప్రాంతాలలో పర్యటించ బోతున్నట్లు సమాచారం.

మరోపక్క ఇలాంటి పరిస్థితుల్లో చైనా దేశం రెండో దఫా లాక్ డౌన్ కొన్ని ప్రాంతాలలో.డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధులు పర్యటించాలని అనుకుంటున్న ప్రాంతాలలో విధించటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

మరోపక్క ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్ పుట్టుక నిగ్గు తేల్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పై ఒత్తిడి తీసుకువస్తున్నారు.ఇటువంటి తరుణంలో చైనా లో అడుగుపెట్టిన డబ్ల్యూహెచ్వో ప్రతినిధులు ఎటువంటి సమాచారం సేకరిస్తాఏరో అన్నది సస్పెన్స్ గా మారింది.

 

#Corona Virus #China #Lock Down

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు