వ్యాక్సిన్ పై WHO కీలక ప్రకటన .. 2022 వరకు వేచి చూడాల్సిందే !

కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది.ప్రస్తుతం కరోనా ను సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ వచ్చే తప్ప , ప్రపంచంలో కరోనా వైరస్ అంతం అయ్యే సూచనలు కనిపించడం లేదు.

 Who Key Announcement On Corona Vaccine-TeluguStop.com

దీనితో అందరూ కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నారు.ఈ కరోనా వ్యాక్సిన్‌ కోసం.

పలుదేశాల్లో ట్రయల్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి.అయితే, 2021 వరకు ఒక్క వ్యాక్సిన్‌ అయినా అందుబాటులోకి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

అయితే, అది తక్కువ మోతాదులో అందుబాటులో ఉంటుందని అభిప్రాయపడింది.దీంతో అందరికీ ఒకేసారి పంపిణీ చేయడం సాధ్యం కాకపోవచ్చని ప్రకటించింది.దీనితో ముందుగా కరోనా వల్ల రిస్క్‌లో ఉన్న హెల్త్ వర్కర్లకు ముందుగా టీకా అందుతుందని డబ్ల్యూహెచ్ ‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ చెప్పారు.ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా పలు రకాల కరోనా టీకా ట్రయల్స్ శరవేగంగా జరుగుతున్నాయని, ముందుగా ఎవరికి టీకా ఇవ్వాలన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

2021 వరకు కనీసం ఒక్క వ్యాక్సిన్ అయినా వస్తుందని ఆమె అన్నారు.కానీ, ఆ టీకా చాలా తక్కువ మోతాదులో అందుబాటులో ఉంటుందన్నారు.

కరోనాపై ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వారియర్స్‌కు ముందుగా టీకా ఇవ్వాల్సి ఉంటుందని.దీనికి చాలావరకు అందరూ మద్దతు తెలిపారని అన్నారు.

ఆరోగ్యంగా ఉన్నవాళ్లు, యువతీయువకులు 2022 వరకు కరోనా టీకా కోసం వేచి చూడాల్సి ఉంటుందని స్వామినాథన్‌ చెప్పారు.త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలు రానున్నాయి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube