టాలీవుడ్ లో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున ఎవరి పేరు కూడా చెప్పలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి.రోజుకొక హీరోయిన్ ఇండస్ట్రీకి వస్తున్న ఈ నేపథ్యంలో ఈ స్థానం కోసం పోటీ పడుతున్న వారు, పోటీ పడినవారు చాలా మంది ఉన్నారు.
నిన్న మొన్నటి వరకు వరుస సినిమాలో నటించి నెంబర్ వన్ స్థానంలో ఉన్న శ్రీలీల కు ప్రస్తుతం సినిమాలు లేకుండా పోయాయ్.ఆమె చేతిలో కేవలం విజయ్ దేవరకొండ సినిమా మాత్రమే ఉంది.
ఇలా ఒక్క సినిమా చేతిలో ఉన్న హీరోయిన్ నెంబర్ వన్ హీరోయిన్ ఎలా అవుతుంది? అందుకే శ్రీలీల ఈ రేస్ నుంచి అవుట్ అయిపోయింది.ఇక ఒకటి రెండు సినిమాలు చేసిన మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) కి టాలీవుడ్ నెంబర్ 1 స్థానం ఇవ్వడం అప్పుడే జరగని పని.

ఇక శ్రీలీల మృనాల్ ఠాకూర్ ని కాసేపు పక్కన పెడితే ఈ మధ్యకాలంలో తెలుగులో మీనాక్షి చౌదరి హవా బాగా పెరిగిపోయింది.సీనియర్ హీరో వెంకటేష్, జూనియర్ హీరోలైన దుల్కర్ సల్మాన్, విశ్వక్సేన్ వంటి హీరోలతో ఈ అమ్మడు నటిస్తోంది.ఇక ఒంటి చేత్తో అనేక సినిమాలు లైన్ లో పెట్టిన పూజ హెగ్డే రెండేళ్ల క్రితం వరకు టాప్ హీరోయిన్ గా కొనసాగినప్పటికీ ఇప్పుడు ఈ అమ్మడి గురించి దాదాపు అందరూ మర్చిపోయారు.సినిమాల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ తెలుగు సినిమాలను పక్కన పెట్టి కేవలం బాలీవుడ్ లోనే నటిస్తున్న రష్మిక టాలీవుడ్ నెంబర్ 1 స్థానం కోసం రేసులో లేను అంటుంది.

పుష్ప 2 సినిమాలో ఆమె నటిస్తున్నప్పటికీ ఆమెను బాలీవుడ్ హీరోయిన్ గానే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది.ఇక తమన్నా సమంత, రకుల్, కాజల్ ఈ రేసు నుంచి ఇప్పటికే అవుట్ అయిపోయారు.వీరి చేతిలో టాలీవుడ్ లో పెద్ద సినిమాలు ఏమీ లేవు.ఎప్పుడో ఒకసారి ఫీమేల్ లీడ్ మూవీ తో అదరగొడుతున్న వారు గ్లామర్ హీరోయిన్స్ తో పోటీపడే పరిస్థితి లేదు.
కృతి శెట్టి, శ్రీలీల వరుస పరాజయాలు ఎదుర్కొంటూ కొత్త హీరోయిన్ ఎవరు వస్తారో ఆ స్థానాన్ని ఎవరు ఆక్రమిస్తారా అని అందరిని ఎదురుచూసేలా చేస్తున్నారు.ఇంత గ్యాప్ కవర్ చేయడానికి నేనున్నాను అంటూ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వస్తుంది.
రామ్ చరణ్ తో, జూనియర్ ఎన్టీఆర్ తో, అల్లు అర్జున్ తో ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయితే ఒప్పుకుంటుంది కానీ ఇవి విడుదలయితే గానీ ఆమెకు నెంబర్ 1 స్థానం దక్కడం కష్టం.మరి చూడాలి ఇంకొన్నాళ్ళు ఈ టాలీవుడ్ నెంబర్వన్ స్థానం ఖాళీగానే ఉండేలా ఉంది.