Manchu Saradhi: మంచు కుటుంబం లో చిచ్చు పెట్టిన ఈ మంచు సారధి ఎవరు ?

మొత్తానికి మంచు ఇంట్లో చాల రోజులుగా గొడవలు జరుగుతున్నాయి అంటూ సోషల్ మీడియా లో వస్తున్న వార్తలకు పూర్తి స్థాయి బూస్టప్ ఇచ్చింది మంచు బ్రదర్స్( Manchu Brothers ) గొడవ వీడియో.అక్కడ ఉన్న లొకేషన్ ని బట్టి ఇది అస్సలు మంచు వారి ఇంట్లో జరగలేదు కాబట్టి ఏ షూట్ లేదా సినిమా ప్రమోషన్ అంటూ కొట్టి పారేస్తున్నారు కొందరు నెటిజన్స్.

 Who Is This Manchu Saradhi-TeluguStop.com

వీడియో లో జరుగుతున్నట్టు గొడవ నిజం అయినా అబద్దం అయినా ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రమోషన్ పిచ్చి వేషాలు చాల మంది ఫాలో అవుతున్నారు కాబట్టి అందుకే ఈ వీడియో ను చాల మంది సీరియస్ గా తీసుకోలేదు.

Telugu Manchu Brothers, Manchu, Manchu Lakshmi, Manchu Manoj, Manchu Saradhi, Ma

ఒక వేల నిజం అయినా కూడా వారింటి విషయాలను రచ్చ చేసుకోవడం ద్వారా కలిగే ప్రతిఫలం ఏంటి అనేది పెద్ద ప్రశ్న.ఇక ఆ వీడియో లో ఉన్న వ్యక్తుల విషయానికి వస్తే సారధి ( Saradhi ) అనే వ్యక్తి ప్రముఖంగా మీడియాలో ఫోకస్ అవుతుంది.సారధి అనే ఈ వ్యక్తి వరసకు మంచు మోహన్ బాబు కి( Mohan Babu ) తమ్ముడు అవుతాడు.

ఎన్నో ఏళ్లుగా మోహన్ బాబు తో ఉన్న సారధి మంచు విష్ణు కెరీర్ మొదలు కాగానే విష్ణు చిత్రం నుంచి అతడికి కుడి భుజంగా ఉంటూ వచ్చాడు.అయితే గత కొద్దీ రోజులుగా సారధి మనోజ్ వెంట ఉంటున్నట్టు తెలుస్తుంది.

సారధి కి విష్ణు కి ఎక్కడ చెడింది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉండగా, ఇప్పుడు మాత్రం విషయం ఇంకా డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి అటు మంచు లక్ష్మి, ఇటు మోహన్ బాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

Telugu Manchu Brothers, Manchu, Manchu Lakshmi, Manchu Manoj, Manchu Saradhi, Ma

ముందుగా మంచు మనోజ్ చేసిన ట్వీట్ ని డిలీట్ చేయించారు.ఆ తర్వాత అది ఒక చిన్న విషయం అంటూ మంచి విష్ణు చెప్పడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది.కెరీర్ విషయాల్లో ఇద్దరు అన్నదమ్ములు కూడా ఫ్లోప్స్ తోనే ఉన్నారు.

మరియు కుటుంబాల పరంగా ఉన్న ఆ చిక్కు ముడులు ఏంటి అనేది బయటకు రావాల్సి ఉంది.మనోజ్ పెళ్లిలో కూడా మంచు విష్ణు కుటుంబం అంటుముట్టనట్టుగానే ఉన్నారు.

మరి ఇంకా ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube