తిమ్మరుసు.. ఇష్క్‌ లో విజేత ఎవరో తేలిపోయింది

కరోనా సెకండ్‌ వేవ్ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో మళ్లీ సినిమాల హడావుడి మొదలు అయ్యింది.మొన్న శుక్రవారం విడుదల అయిన తిమ్మరుసు మరియు ఇష్క్‌ సినిమాలతో టాలీవుడ్‌ కు మళ్లీ పునః ప్రారంభం దక్కినట్లయ్యింది.

 Who Is The Winner In Thimmarusu And Ishq-TeluguStop.com

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ రెండు సినిమాలకు రివ్యూల పరంగా ఎలాంటి టాక్ వచ్చింది.వసూళ్ల పరంగా టాక్ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది.

రివ్యూల పరంగా మాత్రం తిమ్మరుసుకు మంచి టాక్‌ వచ్చింది.సత్యదేవ్‌ నటనతో పాటు మంచి కామెడీ ఇంకా ఇంట్రెస్టింగ్‌ సన్నివేశాలతో ఆకట్టుకున్నాయి అంటూ రివ్యూవర్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

 Who Is The Winner In Thimmarusu And Ishq-తిమ్మరుసు.. ఇష్క్‌ లో విజేత ఎవరో తేలిపోయింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే సమయంలో ఇష్క్‌ సినిమాకు మాత్రం రివ్యూవర్స్ యావరేజ్ కంటే తక్కువ మార్కులు వేశారు.సినిమా నాసిరకంగా ఉందంటూ కామెంట్స్‌ చేశారు.

రివ్యూలు ఎలా వచ్చినా బయట టాక్‌ ఎలా వచ్చినా కూడా తిమ్మరుసు మరియు ఇష్క్‌ సినిమాలకు వసూళ్లు కాస్త అటు ఇటుగా సమానంగానే వచ్చాయి.తిమ్మరుసు సినిమాకు విశ్వసనీయంగా అందుతున్న సమాచారం.ప్రకారం 1.22 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు అయ్యాయి.ఇక ఇష్క్‌ సినిమాకు గాను 1.18 కోట్ల రూపాయలు నమోదు అయ్యాయి.బ్రేక్‌ ఈవెన్‌ కు రెండు సినిమాలు కూడా చేరుకోలేక పోయాయి.మొదటి వారం పూర్తి అయ్యే వరకు ఈ సినిమాలు బ్రేక్‌ ఈవెన్‌ ను సాధిస్తాయా అంటే చూడాలి అంటున్నారు.

Telugu Film News, Ishq, Movie News, Satyadev, Teja Sajja, Timmarusu-Movie

ఈ వారం మళ్లీ పెద్ద సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి.కనుక ఖచ్చితంగా ఈ రెండు సినిమాలను జనాలు మర్చి పోతారు.అంటే ఈ రెండు ఓటీటీలోకి రావాల్సిందే.కనుక రెండు మూడు వారాల్లోనే ఈ సినిమాలు ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

#Ishq #Timmarusu #Teja Sajja #Satyadev

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు