ముగ్గురూ ముగ్గురే ... గెలుపుకి ఎవరు దగ్గరో !

ఏపీలో మరి కొద్ది నెలల్లో జరగబోయే ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే ఉత్కంఠ ప్రజల్లో చాలా ఎక్కువగా ఉంది.ఎందుకంటే మూడు ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేన ఎవరికి వారు గెలుపు తమదే అన్నట్లుగా …అనేక సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ ముందుకు దూసుకుపోతున్నాయి.

 Who Is The Winner In 2019 Ap Elections-TeluguStop.com

ఒకరిని మించి మరొకరు హామీలు గుప్పిస్తూ ప్రజల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అధికారం మాదే మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ ఎన్నికల్లో ఈ మూడు ప్రధాన పార్టీలు ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.ఒక పార్టీతో మరో పార్టీ పొత్తు పెట్టుకునే పరిస్థితి ప్రస్తుతం కనబడటం లేదు.

కాకపోతే ఎన్నికల అనంతరం ఒక పార్టీతో మరొక పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది.ఎందుకంటే ఈ మూడు ప్రధాన పార్టీలు తప్పనిసరిగా సీట్లను పంచుకుంటాయి కాబట్టి ఫస్ట్ మెజారిటీ వచ్చే అవకాశం ఏ పార్టీకి ఉండకపోవచ్చు.

ఇటీవలే పాదయాత్ర ముగించుకున్న వైసిపి అధినేత జగన్.ఈ సందర్భంగా ప్రజలపై వరాల జల్లు కురిపించారు.తమను గెలిపిస్తే.విద్యార్థులకు, వృద్ధులకు వికలాంగులకు, వితంతులకు ఇలా సమాజంలోని అన్ని వర్గాలను ఆదుకుంటానని చెబుతున్నారు.ఇక ఏడాదికి పైగా కాలం నుంచి వైఎస్సార్ నవరత్నాలు కార్యక్రమాన్ని కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు.పాదయాత్ర ద్వారా గ్రామ గ్రామానా ప్రజలకు చేరువ అయ్యారు.

ఇక జనసేన విషయానికి వస్తే.అయన రాజకీయ వ్యూహాలు ఎవరికీ అర్ధం కావడం లేదు.

నిన్న మొన్నటి వరకు కూడా తనకు అధికారమే కావాలని చెప్పిన పవన్‌.ఇప్పుడు మాత్రం సిద్ధాంతమే తనకు ముందు అని ప్రకటిస్తున్నారు.

ఇక ఎన్నికల మ్యానిఫెస్టో విషయంపై కొన్ని ప్రకటనలు చేసినా.ఇప్పటి వరకు ఆయన పెద్దగా దృష్టి పెట్టిందిలేదు.

డబ్బు ఇవ్వనిదే ఓటు వెయ్యని ప్రస్తుత కాలంలో కొత్తవారికి అంత డబ్బు ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది? అనేది చూసుకోకుండా కేవలం ప్రయోగాత్మక రాజకీయాలు చేస్తున్నట్టుగానే పవన్ కనిపిస్తున్నాడు.ఇక టీడీపీ అధినేత చంద్రబాబు విషయానికి వస్తే.ఈయన చాలా వ్యూహాత్మకంగా తన 40 ఏళ్ల అనుభవాన్నిరంగరించి ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా ఆయన ముందుకు వెళ్తున్నారు.ఎక్కడ ఏ ప్రక్రియ మొదలు పెడితే.అనుకూలంగా ఉంటుందో ముందుగానే గుర్తించి ముందుకుసాగుతున్నారు.ఈ నేపథ్యంలో జిల్లాల్లో ప్రధానంగా ఉన్న సమస్యలకు చెక్ పెట్టడం ద్వారా అక్కడి ప్రజల నుంచి భారీ ఎత్తున మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు .అలాగే ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో పోగొట్టేందుకు కొత్త కొత్త హామీలు ఇస్తూ … వాటిని ఇప్పటినుంచే అమలు చెయ్యడం ప్రారంభించాడు .ఇలా ఈ మూడు పార్టీల అధినేతలు … గెలుపు కోసం ఆరాట పడుతున్నారు .అయితే ఈ ముగ్గురిలో ఎవరికి ప్రజల మద్దతు ఉంటుందో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube