F3 సినిమాలో మూడవ హీరో ఎవరో తెలిసిపోయింది !

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా F3.ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇది F2 సీక్వెల్ గా వస్తుంది.F2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు.ఇప్పుడు ఈ సినిమాను కూడా మరింత ఫన్ తో తెరకెక్కించబోతున్నట్టు దర్శకుడు తెలిపాడు.ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ నటిస్తున్నారు.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

 F3 సినిమాలో మూడవ హీరో ఎవరో తెలి�-TeluguStop.com

అనిల్ రావిపూడి మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేసి సూపర్ హిట్ అందుకోవడంతో ఇప్పుడు ప్రేక్షకులు F3 సినిమాపై అంచనాలు పెంచుకున్నారు.F2 సినిమా విడుదల అయినా సమయంలోనే F3 సినిమాను ప్రకటించారు.F3 సినిమాలో ముగ్గురు హీరోలు నటించబోతున్నారని ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ప్రచారం జరుగుతుంది.

Telugu Anil Ravipudi, Sequel, Sunil, Mahesh Babu, Mehrenekaur, Raviteja, Thamann

ఈ సినిమాలో మూడవ హీరోగా చాలా మంది పేర్లు వినిపించారు.రవితేజ దగ్గర నుండి మహేష్ బాబు వరకు ఇలా చాలా నటుల పేర్లు వార్తల్లో నిలిచాయి.అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.ఈ సినిమా క్లైమాక్స్, పాటలు మినహా మిగతా షూటింగ్ పూర్తి అయ్యిందని టాక్.ఈ సినిమాలో సునీల్ పాత్ర గురించి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

F3 సినిమాలో మొదటి నుండి చివరి వరకు సునీల్ పాత్ర ఉంటుందని ఈయన పాత్ర చాలా కామెడీగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.వెంకటేష్, వరుణ్ తేజ్ లతో కలిసి ఆయన కామెడీ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.అంతేకాదు ఈ సినిమాలో సునీల్ మూడవ హీరో పాత్ర చేసాడని భావించవచ్చని టాక్ గట్టిగానే వినిపిస్తుంది.

ఈ సినిమా ఆగస్టు 27 వ విడుదల కాబోతుంది.చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత అలరిస్తుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube