ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన పాత్రని మరోకరు చేయడం సర్వ సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం…అయితే ఇప్పుడు విలన్ పాత్రలను చాలామంది హీరోలు చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాము…ముఖ్యంగా బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇక అప్పుడు వచ్చిన ఆ గుర్తింపుతో ఆయన ఇప్పటివరకు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబుతో( Balayya Babu ) బోయపాటి చేసిన అఖండ సినిమాలో( Akhanda ) శ్రీకాంత్ ని( Srikanth ) విలన్ గా తీసుకున్నాడు.ఇక ఈ సినిమా లో శ్రీకాంత్ కూడా తనదైన పాత్రలో చాలా బాగా నటించి మంచి గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు.అయితే నిజానికి ఈ సినిమాలో శ్రీకాంత్ కంటే ముందే వేరే తెలుగు స్టార్ హీరోని తీసుకోవాలనుకున్నారంట.కానీ ఆయన ఆ క్యారెక్టర్ కి నో చెప్పడంతో శ్రీకాంత్ నే ఆ పాత్రలో తీసుకున్నారు.అయితే మొదట యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు పొందిన రాజశేఖర్ ని( Rajasekhar ) ఈ సినిమాలో తీసుకోవాలని బోయపాటి అనుకున్నాడట కానీ,
రాజశేఖర్ అప్పుడు కొన్ని సినిమాల్లో హీరోగా చేస్తూ బిజీగా ఉండడం వల్ల తను ఆ సినిమాలో చేయలేకపోయాడు.ఇక దాంతో శ్రీకాంత్ ను విలన్ గా పెట్టి ఈ సినిమా చేశాడు.ఈ సినిమాలో శ్రీకాంత్ నటన అద్భుతంగా ఉందనే చెప్పాలి.ఇక దాంతో ఆయనకు పలు సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్లు వచ్చి తను మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక ఇప్పుడు శ్రీకాంత్ కూడా వీలైనన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేస్తే ముందుకు దూసుకెళ్తున్నాడు…
.