3 కోట్ల ఇళ్లు1 కోటి రూపాయల కారు..హరి తేజ కి ఇన్ని కోట్ల ఆస్తులు రావడానికి కారణం ఎవరు..?  

Who is the reason for anchor hari teja success, hari teja car and home, hari teja Baby bump, Husband Deepak Rao, Trivikram, A Aa Movie - Telugu A Aa Movie, Hari Teja Baby Bump, Hari Teja Car And Home, Husband Deepak Rao, Trivikram

హరి తేజ కి ఇన్ని కోట్ల ఆస్తులు రావడానికి కారణం ఎవరు.?


TeluguStop.com - Who Is The Reason Behind The Anchor Hari Teja Success

సినిమా ఇండస్ట్రీలో విజయాన్ని సొంతం చేసుకోవాలంటే అంతా సులువైన పని కాదు.టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి.అలాగే కలలు కనడం అందరూ చేసే పనే, కానీ ఆ కలలు సాకారం చేసుకోవడం మాత్రం కొంత మందికి మాత్రమే సాధ్యం.

అలా విజయం సాధించిన వాళ్లలో యాంకర్, నటి హరితేజ కూడా ఒకరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.బుల్లితెర నటిగా కెరీర్ మొదలుపెట్టిన హరితేజ ఆ తరువాత యాంకర్‌ గా, వెండితెర నటి గానూ తన టాలెంట్‌ ను ప్రూవ్ చేసుకుంది.

TeluguStop.com - 3 కోట్ల ఇళ్లు1 కోటి రూపాయల కారు..హరి తేజ కి ఇన్ని కోట్ల ఆస్తులు రావడానికి కారణం ఎవరు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అలాగే హరితేజ ఒక ప్రత్యేక కూచిపూడి నృత్య కళాకారిణి కూడా.చాలా తెలుగు టీవీ షోస్ లలో కూడా నాట్యం చేసింది.అలాగే టీవీ సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టిన ఈ భామ 2007 లో సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది.

త్రివిక్రమ్ దర్శకుడిగా వచ్చిన అ.ఆ.సినిమాలో హీరోయిన్ సమంతకి పక్కన క్యారెక్టర్ లో నటించింది.అప్పటివరకు ఏ సినిమాకు రానంత క్రెజ్ ఒక్కసారిగా ఆ సినిమాతో హరితేజాకు వచ్చింది.ఆ తర్వాత బుల్లితెర లో ప్రసారమయ్యే బిగ్ బాస్ హోస్ -1 లో పాల్గొని ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

బుర్రకథ అంటూ బిగ్ బాస్ హౌస్ ను అల్లాడించింది.ఒకానొక సమయంలో బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పోటీ ఇచ్చింది.బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చాక హరి తేజకు నటిగా, యాంకర్ గా అవకాశాలు పెరిగాయి.కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఎంతగానో కష్టపడ్డ హరితేజ ఆఫర్లు వచ్చిన తరువాత మాత్రం వెనుతిరిగి చూసుకోలేదు.

వచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు అనుగుణంగా మార్చుకుంది.ఇలా తన భవిష్యత్తును ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని తన తాజా చిరకాల కోరికను నిజం చేసుకుని తెగ మురిసిపోతోంది.ఏంటా అనుకుంటున్నారా.? తనకు నచ్చిన విధంగా ఉండే సొంత ఇంటిని కొనుగోలు చేయాలన్నా తన కలను నిజం చేసుకుంది.ఎట్టకేలకు అదిరిపోయే లొకేషన్‌ లో సౌకర్యవంతమైన ఇంటిని తన సొంతం చేసుకుంది.దాదాపు ఆ ఇంటి విలువ సుమారు 3 కోట్ల వరకు ఉంటుంది.అలాగే తన భర్త అయిన దీపక్ రావుతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగు కూడా పెట్టేసింది.ఈ విషయాన్ని ఒకానొక సందర్బంలో తనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది.“ఇంత కాలానికి తాను కన్న కలని నిజం చేసుకున్నానని” తన భర్తతో కలిసి కొత్త ఇంటిలోకి ప్రవేశిస్తున్న ఫొటోని అప్పట్లో తన ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేసింది కూడా.అంతేకాకుండా ఒక కోటి రూపాయలు విలువ చేసే వోల్వో ఎస్‌యూవీ కారును కూడా కొనుగోలు చేసినది హరితేజ.

ఆ కారు ముందు ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.కారుకు స్వాగతం చెబుతూ కామెంట్ చేసింది.

అసలు హరితేజ ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.ఆయన సినిమాలో అవకాశం ఇవ్వకపోతే హరితేజ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చేది కాదని చాలామంది నెటిజన్లు అప్పట్లో హరితేజాకు కామెంట్స్ కూడా పెట్టారు.అలానే త్రివిక్రమ్ తాను ఎంచుకునే సినిమాల్లో క్యారెక్టర్స్ కూడా అలానే ఉంటాయి.అంతగా గుర్తింపు లేని నదియాను కూడా అత్తారింటికి దారేది సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసింది త్రివిక్రమ్.

ఆ సినిమాతోనే నదియా క్రెజ్ విపరీతంగా పెరిగిపోయింది.అలాగే హరి తేజ కూడా ఈ స్థాయికి చేరుకోవడానికి మాటల మాంత్రికుడు కూడా బాగానే సపోర్ట్ చేసాడు.

అలాగే ఆమె తాజాగా ఓ శుభవార్త చెబుతూ వీడియో కూడా రిలీజ్ చేసింది.తాను త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నానని తెలుపుతూ బేబీ బంప్ షో చేసింది.

ఏది ఏమయినా హరి తేజ మొదట్లో చిన్న చిన్న షోలు, సీరియల్స్ చేస్తూ ఒక రేంజ్ లోకి రావడానికి తనలోని ఆత్మవిశ్వాసమే కారణం అని చెప్పవచ్చు.

#HariTeja #A Aa Movie #HariTeja #Trivikram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు