రష్మిక, పూజా హెగ్డే మధ్య గొడవ.. కారణం వాళ్లే..?  

who is the number one heroine in tollywood,number one heroine,Pooja Hegde, Rashmika mandanna, tollywood industry - Telugu Number One Heroine, Pooja Hegde, Rashmika Mandanna, Tollywood Industry

ఛలో సినిమాతో రష్మిక మందన్నా, ఒక లైలా కోసం సినిమాతో పూజా హెగ్డే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.రష్మిక తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా పూజా హెగ్డే తొలి సినిమా ఫ్లాపైనా ఆ తరువాత స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

TeluguStop.com - Who Is The Number One Heroine In Tollywood

ప్రస్తుతం ఇండస్ట్రీలో నంబర్ 1, నంబర్ 2 హీరోయిన్లు ఎవరంటే సినీ ప్రేక్షకులు పూజా హెగ్డే, రష్మిక మందన్న పేర్లు చెబుతున్నారు.

తమ హీరోయిన్ నంబర్ 1 అంటే తమ హీరోయిన్ నంబర్ 1 అంటూ పూజా హెగ్డే, రష్మిక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొడవ పడుతున్నారు.

TeluguStop.com - రష్మిక, పూజా హెగ్డే మధ్య గొడవ.. కారణం వాళ్లే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రత్యక్షంగా, పరోక్షంగా పూజా హెగ్డే, రష్మికకు మధ్య ఎలాంటి గొడవలు లేకపోయినా ఫ్యాన్స్ మాత్రం గొడవ పడుతూ వాళ్లిద్దరి మధ్య చిచ్చు పెడుతుండటం గమనార్హం.అవకాశాల పరంగా చూసినా, పారితోషికంగా పరంగా చూసినా రష్మిక, పూజా హెగ్డే ప్రస్తుతం దాదాపు సమాన స్థాయిలో ఉన్నారు.

పూజా హెగ్డే టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇస్తుంటే రష్మిక మందన్న మాత్రం తెలుగుతో పాటు కన్నడలో వరుస అవకాశాలతో బిజీగా ఉంది.ఇద్దరు హీరోయిన్లకు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తున్నాయి.

గతేడాది వరకు సమంత, రకుల్, కాజల్, తమన్నా లాంటి హీరోయిన్ల హవా నడిచినా ప్రస్తుతం పూజా హెగ్డే, రష్మిక మధ్యే ప్రధానంగా పోటీ ఉంది.

ప్రస్తుతం పూజాహెగ్డే రాధే ధ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటిస్తోంటే రష్మిక మందన్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి.ఈ సినిమాలతో పాటు వీళ్లిద్దరి చేతిలో మరికొన్ని ఆఫర్లు ఉన్నాయి.ఈ ఇద్దరు హీరోయిన్ల తరువాత సినిమాల ఫలితాలను బట్టి ఈ హీరోయిన్లలో ఎవరు నంబర్ వన్ హీరోయినో, ఎవరు నంబర్ టూ హీరోయినో డిసైడ్ చేయవచ్చు.

#Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు