బిగ్‌ బాస్‌ 3 : పుకార్లు సరే కాని, మరీ ఇంత చిల్లర పుకార్లు ఏంట్రా బాబోయ్‌  

  • తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 గురించి ఇప్పటికే రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పెద్ద ఎత్తున సీజన్‌ 3 గురించి వార్తలు ఏదో ఒక రకంగా వస్తున్నాయి. చిరంజీవి, వెంకటేష్‌లలో ఒకరు బిగ్‌బాస్‌కు హోస్టింగ్‌ చేయబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ వార్తలపై ఇటీవలే వెంకటేష్‌ స్పందిస్తూ అలాంటిది ఏమీ లేదన్నాడు. ఇక చిరంజీవి ప్రస్తుతం అలాంటి ఆలోచన లేకుండా కేవలం సినిమాలపైనే ఫోకస్‌ పెట్టాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు పుకార్లు షికారు అయ్యేలా చేస్తున్నారు.

  • Who Is The Next Bigg Boss 3 Host In Telugu-Bigg Telugu Host Koushal Koushal Big

    Who Is The Next Bigg Boss 3 Host In Telugu

  • తాజాగా బిగ్‌బాస్‌ సీజన్‌ 3 గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అదేంటి అంటే ఈ షోకు హోస్ట్‌గా కౌశల్‌ వ్యవహరించబోతున్నాడట. మాటీవీ వారు సీజన్‌ 3కి కౌశల్‌ అయితే బాగుంటుందని భావిస్తున్నారట. కౌశల్‌ ముక్కుసూటి తనంతో మంచిగా హోస్టింగ్‌ చేస్తాడని నమ్ముతున్నారట. మొత్తానికి కౌశల్‌ తో బిగ్‌ బాస్‌ నిర్వాహకులు చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారు.

  • Who Is The Next Bigg Boss 3 Host In Telugu-Bigg Telugu Host Koushal Koushal Big
  • పుకార్లు పుట్టించడం పర్వాలేదు కాని, కొన్ని సార్లు మరీ ఇంత దారుణమైన పుకార్లు పుట్టించడం ఏంట్రా అనిపిస్తుంది. మరీ దారుణంగా పుకార్ల విషయంలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కానిచేస్తున్నారు. పుకార్లు పుట్టించే క్రమంలో కాస్త వెనుక ముందు ఆలోచించరా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. కౌశల్‌ అసలు ఎలా బిగ్‌బాస్‌ 3కి హోస్ట్‌గా చేస్తాడు.

  • Who Is The Next Bigg Boss 3 Host In Telugu-Bigg Telugu Host Koushal Koushal Big
  • అతడికి ఉన్న స్థాయి ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. బిగ్‌బాస్‌ను ఎప్పుడైనా స్టార్స్‌ మాత్రమే హోస్ట్‌ చేస్తారనే విషయం మీకు తెలియదా అంటూ బిగ్‌బాస్‌ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.