అధ్యక్షుడి వెంట రెడ్ కార్పెట్ పై నడిచిన భారతీయ మహిళ,ఎవరంటే  

Who Is The Lady Accompanying With Trump On Red Carpet - Telugu Donald Trump, Gurdeep Chawla, Melania, Modi Language Translator, Narendra Modi, Red Carpet, Trump Indian Tour, గురుదీప్ చావాలా

భారత పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులతో కలిసి నిన్న అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే.ఎయిర్ పోర్ట్ లోనే భారత ప్రధాని నరేంద్రమోడీ వారికి రెడ్ కార్పెట్ పరచి సాదరంగా స్వాగతం పలికారు.

Who Is The Lady Accompanying With Trump On Red Carpet - Telugu Donald Gurdeep Chawla Melania Modi Language Translator Narendra Indian Tour గురుదీప్ చావాలా

అయితే ఈ సమయంలోనే ట్రంప్ వెంట ఒక భారతీయ మహిళ కూడా రెడ్ కార్పెట్ పై నిడిచింది.అయితే అసలు ఆ మహిళ ఎవరు ఎందుకు వారితో కలిసి ఉంది అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

అయితే ఇంతకీ ఆ మహిళ ఎవరు అంటే గురుదీప్ చావ్లా.అమెరికా లో నివాసం ఉంటున్న భారత సంతతి కి చెందిన మహిళ.

ఆమె ట్రాన్స్ లెటర్ గా 27 ఏళ్ల అనుభవం కలిగి ఉన్నవారు.అయితే ప్రస్తుతం ఆమె ప్రధాని నరేంద్ర మోడీ కి అనువాదకురాలిగా పని చేస్తున్నారు.

ఒక్క పీఎం మోడీ కే కాకుండా ఆమె గతంలో వీపీ సింగ్, చంద్రశేఖర్,నరసింహారావు,అటల్ బిహారి వాజ్ పేయి, గుజ్రాల్,మన్మోహన్ సింగ్ ల వంటి వారందరికీ కూడా ఆమె ట్రాన్స్ లెటర్ గా పనిచేశారు.1990లో గురుదీప్ చావ్లా ఇండియన్ పార్లమెంట్‌లో అనువాదకురాలిగా తన కెరీర్‌ను ప్రారంభించారు.అప్పుడు ఆమె వయసు 21.2015 రిపబ్లిక్ డే పెరేడ్ సందర్భంగా బరాక్ ఒబామాకు కూడా ఆమె ట్రాన్స్‌లేటర్‌గా పని చేశారు.ఇక ఇప్పుడు ప్రధానమంత్రి ఏ దేశానికి వెళ్లినా ఆమె ఆయన వెంటే ఉంటారు.ఆయన హిందీ ప్రసంగాన్ని అప్పటికప్పుడు ఇంగ్లీష్‌‌లోకి అనువదించి ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులకు వివరిస్తారు.

అయితే ప్రస్తుతం మోడీ కి ట్రాన్స్ లెటర్ గా వ్యవహరిస్తున్న గురుదీప్ చావాలా, నిన్న అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విమానాశ్రయంలో ట్రంప్, మెలానియా ట్రంప్, నరేంద్ర మోదీలతో రెడ్ కార్పెట్‌‌లో నడిచారు.దీనితో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ మారడం తో అసలు ఆమె ఎవరా అన్న ఆసక్తి నెటిజన్ల లో మొదలైంది.

తాజా వార్తలు

Who Is The Lady Accompanying With Trump On Red Carpet-gurdeep Chawla,melania,modi Language Translator,narendra Modi,red Carpet,trump Indian Tour,గురుదీప్ చావాలా Related....