కోహ్లీ కంటే అత్యధిక జీతం ఉన్న కెప్టెన్ ఎవరంటే?

భారతదేశంలో క్రికెట్ అనేది అత్యంత ఆదరనీయమైన క్రీడ.అన్ని దేశాల్లో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే.

 Who Is The Highest Paid Captain Than Virat Kohli In Cricket, Cricketer Kohli, Cr-TeluguStop.com

కాని భారతదేశంలో క్రికెట్ అంటే ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా చూసేంత అభిమానం మన సొంతం.భారత్ లో చిన్న నాటి నుండే క్రికెట్ ను సరదాగా ఆడుతుంటారు.

అందుకే క్రికెట్ ను ఆడటానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు.క్రికెట్ ను సీరియస్ గా తీసుకోవాలనే వారు చాలా మంది గొప్ప క్రికెటర్ లను ఆదర్శంగా తీసుకుంటారు.

ఒక్కో జనరేషన్ లో ఒక్కో అద్భుతమైన క్రికెటర్ ఉంటారు.ఒక జనరేషన్ లో కపిల్ దేవ్, ఒక జనరేషన్ లో సచిన్ టెండూల్కర్, ప్రస్తుత జనరేషన్ లో విరాట్ కోహ్లీ ఎంతో మంది ఆదర్శంగా నిలుస్తున్నాడు.

క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరు క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు.పరుగుల వరదలు పారిస్తూ ప్రపంచంలో నంబర్ వన్ క్రికెటర్ గా పేరు సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ.

ప్రస్తుతం అత్యంత ఎక్కువ సంపాదన ఆర్జీస్తున్న క్రికెటర్ గా దూసుకుపోతున్నాడు.అయితే ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న కోహ్లీ కంటే అత్యంత సంపాదన ఆర్జీస్తున్న క్రికెటర్ మరొకరు ఉన్నారు.

ఏంటి విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ సంపాదన ఆర్జిస్తున్న మరో క్రికెటర్ ఉన్నారా అని మీకు ఆశ్చర్యం కలుగుతుంది.కదా.అయన ఎవరంటే ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్.జో రూట్ సంవత్సరానికి 8 కోట్ల 97 లక్షల వార్షిక వేతనాన్ని అందుకుంటున్నాడు.

విరాట్ కోహ్లీ మాత్రం ఒక్క సంవత్సరానికి 7 కోట్ల రూపాయల వార్షిక వేతనాన్ని అందుకుంటున్నాడు.అయితే వార్షిక వేతనం విషయంలో విరాట్ కోహ్లీని జోరూట్ మించిపోయాడని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube