బెల్లంకొండ సాయి శ్రీనివాస్( Sai Srinivas ) హీరోగా అల్లుడు శీను అనే సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.ఆ సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకొని వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఆయన బోయపాటి తో చేసిన జయ జానకి నాయక సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.ఈ సినిమాతోనే నటుడు గా కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు అనే చెప్పాలి.
ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేసిన రాక్షసుడు సినిమా కూడా ఆయన కెరియర్ లో గుర్తుండి పోయే సినిమా అనే చెప్పాలి… ఈయన ఛత్రపతి( Chhatrapati ) సినిమాని హిందీ లో రీమేక్ చేస్తున్నాడు.దీనికి వి వి వినాయక్ డైరెక్టర్ ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక టీజర్ కూడా బయటకి వచ్చింది…ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ రీసెంట్ గా సాయి శ్రీనివాస్ హీరో గా BSS10 పేరుతో ఒక సినిమా అనౌన్స్ చేశారు.
దీనికి డైరెక్టర్ గా గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సాగర్ చంద్రతో( Sagar Chandra ) శ్రీనివాస్ బెల్లంకొండ జతకట్టనున్నారు.‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి యూనిక్ స్క్రిప్ట్స్ తో కమర్షియల్ ఎంటర్ టైనర్స్ తీయడంలో పేరు తెచ్చుకున్న దర్శకుడు సాగర్ చంద్ర, బెల్లంకొండ కోసం విన్నింగ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు.చిత్రం మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది.ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఈ చిత్రాన్ని గొప్ప నిర్మాణ విలువలు, భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది.రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది, #BSS10 పై క్యురియాసిటీని జనరేట్ చేస్తుంది.
ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు…
.