టీడీపీ, జ‌న‌సేన పొత్తులో సీఎం ఎవ‌రు.. క్లారిటీ ఇచ్చేసిన ఆ నేత‌..!

Who Is The Cm In Tdp Janasena Alliance That Leader Who Gave Clarity

ఆంధ్రప్రదేశ్.ఇక్కడి రాజకీయాలు ఎప్పుడు కూడా చూసే వారికి మస్తు మజాను అందిస్తాయి.

 Who Is The Cm In Tdp Janasena Alliance That Leader Who Gave Clarity-TeluguStop.com

ఎవరి ఊహాకు అందని విధంగా ఎత్తులు పై ఎత్తులతో ఇక్కడి మార్కు పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి.ఇలాగే 2019 ఎన్నికల్లో జరిగింది.

అసలు టీడీపీ వైసీపీల మధ్య గట్టి పోటీ ఉంటుందనుకుంటే… వైసీపీ 150 పై చిలుకు సీట్లలో గెలిచి సునామీ క్రియేట్ చేసింది.ఇక మిగిలింది 2024 పోటీ.

 Who Is The Cm In Tdp Janasena Alliance That Leader Who Gave Clarity-టీడీపీ, జ‌న‌సేన పొత్తులో సీఎం ఎవ‌రు.. క్లారిటీ ఇచ్చేసిన ఆ నేత‌..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ పోటీ కోసం ఇప్పటికే అన్ని పార్టీలు తమ అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

అదే సమయంలో ఇతర పార్టీలతో పొత్తుల పంచాయతీలను కూడా సర్దుబాటు చేసుకుంటున్నాయి.

ప్రస్తుతం ఎక్కువ మంది చర్చించుకుంటున్నది జనసేన టీడీపీ పొత్తు గురించి.సామాన్యులే కాదు ఆ పార్టీ శ్రేణులు కూడా ఈ పొత్తు గురించే ఆలోచిస్తున్నారు.

అలా టీడీపీలో సీనియర్ నేత అయిన అయ్యన్నపాత్రుడు జనసేన టీడీపీ పొత్తుపై క్లారిటీ ఇచ్చేశారు.ఆయన పొత్తు గురించి కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు…

Telugu Ap, Chandra Babu, Cm Jagan, Janasena, Pavan Kalayan, Cm Tdp-Telugu Political News

ప్రస్తుత ఏపీ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా టీడీపీ జనసేన పొత్త అనివార్యం.ఇక సీట్ల సర్దుబాటు అంటారా.2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్ల కేటాయింపు ఉంటుందని ఆయన కుండ బద్దలు కొట్టారు.అంటే 2019 ఎన్నికల్లో టీడీపీకి 40 శాతం ఓట్లు మరియు జనసేనకు 6.5 శాతం ఓట్లు వచ్చాయి.అంటే జనసేనకు పదిహేను కు మించి సీట్లు ఇవ్వకూడదన్నది అయ్యన్నపాత్రుడి అభిప్రాయంగా తెలుస్తుంది.ఇదే ప్రతిపాదనను జనసేన ఒప్పుకుంటుందో వేచి చూడాలి.2019 నుంచి జనసేన బలంగా తయారవుతూ వస్తోందని ఇప్పటికే చాలా ప్రాంతాల్లో జనసేన గట్టి పోటీ ఇచ్చే విధంగా తయారయిందని జన సైనికులు చెబుతున్నారు.టీడీపీ జ‌న‌సేన అంచ‌నాల‌ను నిజం చేయ‌క‌పోతే అంతిమంగా న‌ష్ట‌పోయేది ప‌వ‌నే.

మరి టీడీపీ నేతలు ఏమని భావిస్తారో పొత్తు కుదిరిదో ఎన్ని సీట్లు కేటాయిస్తారో.

#AP #Pavan Kalayan #AP #Chandra Babu #CM Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube