మహేష్ త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే?

Who Is The Bollywood Star Hero In Mahesh Trivikram Movie

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రానికి దర్శక పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు.అనంతరం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు.

 Who Is The Bollywood Star Hero In Mahesh Trivikram Movie-TeluguStop.com

మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారీ వారి పాట చిత్రం పూర్తికాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో పాల్గొనబోతున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Who Is The Bollywood Star Hero In Mahesh Trivikram Movie-మహేష్ త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ దాదాపు ఖరారైనట్లు పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందులో సంజయ్ దత్ ఒక అవినీతి రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు.

ఇక ఈ విషయం గురించి చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ఇందులో సంజయ్ దత్ ఖరారైనట్లు తెలుస్తోంది.ఇకపోతే ఇందులో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తోంది.ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఖలేజా అతడు వంటి చిత్రాలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమాపై కూడా పెద్దఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి.

#Trivikram #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube