ఆ టీమ్ వర్క్ ... టీఆర్ఎస్ విజయానికి కారణమయ్యిందా ..?  

 • తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. అసలు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనను బయటపెట్టగానే … చాలామంది వెనక్కి లాగారు. ఇప్పుడు ఎన్నికలకు అంత తొందర ఏముంది? ఇప్పుడు ఎన్నికలకు వెళితే చాలా ఇబ్బంది పడతాము అంటూ కేసీఆర్ ని భయపెట్టారు. అయినా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ముందుకే వెళ్లి … తన ప్రత్యర్థులను మూడు చెరువుల నీళ్లు తాగించి తెలంగాణాలో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడించాడు. ఈ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం వెనుక ఒక పెద్ద టీమ్ వర్క్ ఉంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి… అభ్యర్థుల ప్రకటన చేసిన తర్వాత, అసమ్మతులు చెలరేగినా, అసంతృప్తులు వినిపించినా, వారిని దారిలోకి తెచ్చే బాధ్యతను కేటీఆర్‌కే అప్పగించారు కేసీఆర్.

 • Who Is The Backbone Of TRS Party-Harish Rao Kalvakuntla Kavitha Kcr Ktr Trs Party

  Who Is The Backbone Of TRS Party

 • టీఆర్ఎస్ లేదా కేసీఆర్ మీద విపక్షాలు విమర్శలు చేస్తే, వెంటనే వారి మీద ఎదురుదాడి చేసే బాధ్యతను కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు కి అప్పగించాడు కేసీఆర్. 2014 ఎన్నికల హామీలను కేసీఆర్‌ నిలబెట్టుకోలేదన్న విమర్శలకు దీటుగా, ఉత్తమ్‌, చంద్రబాబులకు లేఖల రూపంలో సమాధానం ఇచ్చాడు హరీష్. తనకు ఏ బాధ్యతలు అప్పగించిన సమర్థంగా నిర్వహించి, సక్సెస్‌ చేయడంలో హరీష్ సిద్ధహస్తుడు. అందుకే అతనికి పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుంది. కేసీఆర్ టీమ్ లో మరో కీలక వ్యక్తి నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత. ఆమె ఇప్పటికే సమర్ధవంతమైన నాయకురాలిగా పేరు పొందారు. ఈ ఎన్నికల్లో ఆమెకు సోషల్ మీడియా బాధ్యత అప్పగించారు కేసీఆర్. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు ఎలాంటి విమర్శలు గుప్పించినా, ట్వీట్లు, కామెంట్లతో పంచ్‌లు వేస్తూ కవిత తన సత్తా
  చాటుకున్నారు.

 • Who Is The Backbone Of TRS Party-Harish Rao Kalvakuntla Kavitha Kcr Ktr Trs Party
 • ఇక ఆ టీమ్ లో మరో కీలక వ్యక్తి … కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడిగా పేరున్న పల్లా రాజేశ్వర్‌ రెడ్డి. ఇతడికి ఆర్గనైజింగ్‌ స్కిల్స్‌ ఎక్కువగా ఉన్న విషయాన్ని పసిగట్టిన కేసీఆర్ తన టీంలో చేర్చుకున్నారు. టీఆర్ఎస్‌ సభలకు భారీ స్థాయిలో జనం రావడం వెనక, కీలక పాత్ర పల్లా రాజేశ్వర్‌దే. ఇవేకాదు, పార్టీలో క్రమశిక్షణ తప్పిన కార్యకర్తలపై కటువుగా వ్యవహరించడంలో, ఏమాత్రం వెనకడుగు వేయకుండా పార్టీకి నష్టం జరగకుండా రాజేశ్వరరెడ్డి కీలక పాత్ర వహించాడు. అలాగే టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కూడా ఆ టీమ్ లో కీలకంగా వ్యవహరించాడు. ఆయన కేసీఆర్‌ కు నమ్మినబంటు. ఎన్నికల సంఘం, జాతీయ పార్టీల సమన్వయంలో వినోద్‌దే కీలక పాత్ర. ముందస్తు ఎన్నికలకు ఈసీని ఒప్పించడంలో సక్సెస్‌ అయ్యారు వినోద్. మరో టీమ్ మెంబెర్ కె. కేశవ రావు. టీఆర్ఎస్‌ జనరల్‌ సెక్రటరీ. కేసీఆర్‌ అభిమానించే, గౌరవించే సీనియర్‌ లీడర్. మేనిఫెస్టో బాధ్యతలను సైతం కేకే కే అప్పగించారు.

 • Who Is The Backbone Of TRS Party-Harish Rao Kalvakuntla Kavitha Kcr Ktr Trs Party
 • అలాగే కేసీఆర్ కు అడుగడుగునా తోడుంటే వ్యక్తి సంతోష్‌ కుమార్.కేసీఆర్‌ కుటుంబ సభ్యుడైన సంతోష్‌కు ఈ మధ్యనే రాజ్యసభ పదవి కూడా దక్కింది. అలాగే… దేశపతి శ్రీనివాస్.గేయకారుడు, పాటగాడు, మాజీ ఉపాధ్యాయుడు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ ప్రభుత్వంలో, వివిధ పథకాలకు నినాదాలు రాయడంలో, పాటలు అల్లడంలో, ప్రచార ప్రకటనలు రూపొందించడంలో కీలక పాత్ర దేశపతిదే. ఈ విధంగా కేసీఆర్ ఒక్కొక్కరికి ఒక్కో విధమైన బాధ్యతను అప్పగించి ఎన్నికల్లో ఏ టెన్షన్ లేకుండా పార్టీని విజయం వైపు తీసుకెళ్లడం లో కేసీఆర్ సక్సెస్ అయ్యారు.