తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోలు అంటే మగవాల్లే అనే మైండ్ సెట్ ని మార్చి ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ కంటే ఏం తక్కువ కాదు వాళ్ళు కూడా ఫైట్స్ చేస్తారు అని చేసి చూపించిన ఒకే ఒక హీరోయిన్ విజయశాంతి( Vijaya shanthi )… ఆమె మెయిన్ లీడ్ లో చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి…ఈమె ఓవైపు హీరోల సరసన రొమాన్స్ చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్( Lady oriented ) సినిమాలకు అప్పట్లో కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.ఈమె నటించిన సినిమాలు అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ ( Black Baster Hit )అయ్యి నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించేవి.దాంతో చాలామంది దర్శక నిర్మాతలు విజయశాంతిని పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలను తెరకెక్కించేవారు…

ఇక అప్పట్లో విజయశాంతి క్రేజ్ ఎలా ఉండేదంటే స్టార్ హీరోలు ఎవరికీ కూడా ఈమెకు ఉన్న రెమ్యూనరేషన్ ఇచ్చేవారు కాదట.అప్పట్లో విజయశాంతి కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునేదట.అయితే ఆ టైంలో పెద్దపెద్ద హీరోలకు కూడా ఇంత రెమ్యూనరేషన్ ఉండేది కాదట.ఇక విజయశాంతి నటించిన చాలా సినిమాలు స్టార్ హీరోలైన రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి , బాలకృష్ణ వంటి సినిమాలకు పోటీగా వెళ్లి సూపర్ హిట్ గా నిలిచేవి.అలాంటి విజయశాంతిని చూసి చాలామంది స్టార్ హీరోల సైతం కుల్లుకునేవారట…

అలా అందరూ హీరోలు సైతం కుల్లుకునేలా చేసిన విజయ శాంతి తన కెరియర్ లో చాలా సూపర్ హిట్లు కూడా అందుకున్నారు.అయితే ఆమె హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక స్టార్ హీరో ఆమెని లవ్ చేస్తున్నట్టుగా చెప్పారట అలాగే తనను పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడట కానీ విజయ శాంతి ప్రేమ మీద పెద్ద నమ్మకం లేకపోవడం తో ఆయన చెప్పిన విషయాలని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది ఆట ఒకటి రెండు సార్లు అడిగినా ఆయన ఈమె ఏం రెస్పాన్స్ ఇవ్వకపోవడం తో సైలెంట్ అయిపోయాడట…