నాగ చైతన్య సినిమా విడుదల కష్టాలు

సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఏ ముహూర్తం లో మొదలు పెట్టాడో కానీ నాగ చైతన్య కి ఈ సినిమా విడుదల విషయం లో ఎదురు అవుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు.పోయిన సంవత్సరం విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి దాదాపు ఆరున్నర నెలలు అయినా రిలీజ్ కి నోచుకోలేదు.

 Who Is Stopping Nagacheytanya Movie ?-TeluguStop.com

ఈ సినిమా విడుదల కి ముఖ్య అడ్డంకి తమిళ స్టార్ సింభు తమిళం లో తెలుగు లో పారలల్ గా తీసిన ఈ సినిమాని రెండు చోట్లా ఒకే సారి విడుదల చెయ్యాలనేది నిర్మాతల కండిషన్.స్టొరీ ఎక్కడ ముందుగా విడుదల అయ్యి తెలిసిపోయినా రెండవ చోట సినిమా కొనడానికి డిస్ట్రిబ్యూటర్ లు వెనకాడతారు.

సో ఒకే సారి విడుదల చేద్దాం అని లాస్ట్ ఇయర్ ప్లాన్ చెయ్యగా సింభూ సంబంధించిన వివాదాల కారణంగా సినిమా విడుదల ఆగింది.

ఇప్పుడు జూలై 1 న విడుదల చెయ్యాలని ప్లాన్ చెయ్యగా రజినీకాంత్ కబాలి అదే సమయానికి రానుంది కాబట్టి వాయిదా వేసారు.

కానీ జూలై 29 న కూడా విడుదల కష్టమే అంటున్నారు.వెంకటేష్ సినిమా బాబు బంగారం విడుదల అయ్యే ఛాన్స్ లు అదే డేట్ దగ్గరలో ఉన్నాయి.

చేజేతులా వెళ్లి మామయ్య సినిమాతో పోటీ పడే సాహసం చేయకపోవచ్చు నాగ చైతన్య .ఆ తర్వాత రెండు వారాల్లో జనతా గ్యారేజ్ తో పాటు.చైతు మూవీ ప్రేమమ్ ని కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు.మరి ఈ సాహసానికి కష్టాలు తీరెదెప్పుడో!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube