గాలి కుటుంభంలో చీలిక..రోజాపై పోటీ ఎవరో..??

చిత్తూరు జిల్లా నగరి నిజయోజకవర్గంలో, గత ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది.అక్కడి నుంచీ వైసీపీ తరుపున పోటీ చేసిన రోజా తెలుగుదేశం సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ పై విజయ సాధించారు.

 Who Is Opponent For Mla Roja From Gali Muddu Krishnama Naidu Family-TeluguStop.com

ఆతరువాత పరిణామాలు తెలిసినవే.ముద్దుకృష్ణమ మరణం అనంతరం ఒక్క సారిగా నగరి లో రాజకీయాలో మారిపోయాయి.

ఆయన ఇద్దరు కుమారులలో ఎమ్మెల్సీ ఎవరికి ఇవ్వాలో అర్థం కాకా టీడీపీ కి పెద్ద తలనెప్పిగా తయారయ్యంది ఈ వ్యవహారం.దాంతో చంద్రబాబు నాయుడు.

ముద్దుకృష్ణమ భార్య కి ఎమ్మెల్సీ ఇచ్చేశారు.అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.ఈ తరుణంలో నగరి నుంచీ పోటీ చేసే అవకాసం ఇద్దరు కుమారులలో ఎవరికీ ఇవ్వాలనేది పెద్ద తలనెప్పిగా మారింది టీడీపీ అధినేతకి.ఇప్పటికే పలు సర్వేలు, నగరి ప్రజలు రోజా అభ్యర్ధిత్వంపై పాజిటివ్ గానే స్పందిస్తున్నారు.తాజాగా జరిగిన ఓ సర్వేలో సైతం నగరి ప్రజలు దాదాపు 55 శాతం మంది రోజా కి మద్దతుగా ఉన్నట్టు తెలుస్తోంది.43 శాతం మంది మాత్రమె టీడీపీ కి మద్దతు పలుకుతున్నారు.దాంతో వైసీపీ విజయం పక్కా అని తెలుస్తోంది.

ఇటువంటి పరిస్థితుల్లో రోజాపై పోటీగా గాలి పెద్ద కుమారుడు భాను కి బరిలోకి దించాలా.లేక చిన్న కుమారుడు జగదీష్ ని బరిలోకి దించాలా అనేది బాబు కి అంతుబట్టడం లేదు.అయితే టీడీపీ తరఫు నుంచి అశోక్ రాజుతో జగదీష్- సరస్వతమ్మలు చేతులు కలపడం విశేషం…అయితే అశోక్ రాజు సామాజికవర్గానికే చెందిన కొంతమంది కూడా ఇక్కడి నుంచీ టిక్కెట్టు ఆశిస్తున్నారు.

ఇదిలాఉంటే తనకే టిక్కెట్టు దక్కుతుందని భాను ఇప్పటికే ప్రకటించుకున్నారు కూడా.

కాని ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా అశోక్ రాజు అభ్యర్ధిత్వానికి సరస్వతమ్మ, జగదీష్ లు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు.మరికొందరు ఔత్సాహికులు కూడా కుల సమీకరణాలతో టికెట్ ఆశిస్తున్నారు.దాంతో చంద్రబాబు ఎవరికి ఇక్కడి నుంచీ టిక్కెట్టు ఇవ్వాలో అంతుపట్టడం లేదని టాక్ వినిపిస్తోంది.

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చంద్రబాబు భాను కే టిక్కెట్టు ఖరారు చేస్తారని తెలుస్తోంది.ఏది ఏమైనా భవిష్యత్తులో నగరి టిక్కెట్టు రభస రోజా కి బాగానే కలిసోచ్చేలా చేస్తుంది అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube