ఎవరు ఇల్లు అద్దెకివ్వడం లేదు... ఆవేదన వ్యక్తం చేసిన ఉర్ఫి జావేద్!

హిందీ బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి ఉర్ఫి జావేద్ ఒకరు.ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం తన విభిన్నమైన వస్త్రధారణతో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.

 Who Is Not Renting A House Urfi Javed Expressed Grief Urfi Javed , Bollywood, Mu-TeluguStop.com

ఇలా అర్థనగ్న ప్రదర్శన చేస్తూ ఈమె రోడ్లపై తిరగడంతో ఈమె వ్యవహార శైలి చూసి కొందరు ఈమె పై కేసులు కూడా నమోదు చేశారు.ఇలా తన వస్త్రధారణతో పెద్ద ఎత్తున వార్తల్లో నిలవడమే కాకుండా ఈమె ఎన్నో వివాదాలను కూడా ఎదుర్కొంటున్నారు.

ఇకపోతే తాజాగా నటి ఉర్ఫి జావేద్ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు.ఇంత పెద్ద మహానగరమైన ముంబైలో తనకు ఉండటానికి కనీసం ఇల్లు ఎవరూ కూడా అద్దెకు ఇవ్వడం లేదు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.ఇలా ట్విట్టర్ వేదికగా ఈమె స్పందిస్తూ నా వస్త్రధారణ కారణంగా కొందరు ముస్లింలు తనకు ఇల్లు కిరాయికి ఇవ్వడం లేదని,తాను ముస్లిం కావడంతో ఇదే కారణం చూపిస్తూ హిందువులు కూడా ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదని తెలిపారు.మరికొందరు మాత్రం తనకు వస్తున్న రాజకీయ బెదిరింపులకు భయపడి ఇల్లు అద్దెకు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారని తెలిపారు.

ఇలా ముంబైలో తాను అద్దెకు ఉండడానికి అపార్ట్మెంట్ దొరకడం లేదు అంటూ ఈమె తన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఈమె చేసిన ట్వీట్ కి ఒక నెటిజన్ రిప్లై ఇస్తూ నాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.త్వరలోనే మీకు ఇల్లు దొరకాలని కోరుకుంటున్నా అంటూ రిప్లై ఇచ్చారు.అయితే నెటిజన్ చేసిన ఈ ట్విట్ పై ఉర్ఫి జావేద్ స్పందిస్తూ అవును ప్రతిసారి ఇలాగే జరుగుతుంది.

నాలాంటి ముస్లింలకు, సింగిల్ కు ఇల్లు దొరకడం కష్టంగా ఉంది అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube