వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదా...అయితే ఇక జైలుకే!  

Who Is Neglecting The Older Parents They Become Prison-

ఇటీవల భార్య,భర్తలు ఇద్దరూ ఉద్యోగాలో మరేదైనా కారణమో కావొచ్చు వృద్ధ తల్లిదండ్రులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు చిన్న పిల్లల సంరక్షణ కోసం మాత్రమే కనిపించే ఆశ్రమాలు, ఇప్పుడు వృద్ధుల సంరక్షణ కోసం కూడా ఎక్కడ పడితే అక్కడ వెలిసిపోయాయి. దీనితో సమయం లేని కారణమో,లేదంటే మరేదైనా కారణమో తెలియదు కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా వృద్ధ ఆశ్రమాలలో తల్లిదండ్రులను వదిలేసి చేతులు దులిపేసుకుంటున్నారు..

వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదా...అయితే ఇక జైలుకే!-Who Is Neglecting The Older Parents They Become Prison

దీనితో వారు అక్కడే తమ జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే బీహార్ లో మాత్రం ఇక ఆ పప్పులు ఉడకవు. వృద్ధ తల్లిదండ్రులను సరిగా చూసుకోకపోతే ఇక వారికి జైలు శిక్షే నట.

ఈ మేరకు అక్కడి సీ ఎం నితీష్ కుమార్ ప్రభుత్వం చట్టం కూడా తీసుకువచ్చే పనిలో ఉందట. ఎవరైనా వృద్ధులైన తమ తల్లిదండ్రులను సరిగా చూడని పక్షంలో, కూమారులు,కుమార్తెలు ఎవరినైనా గాని జైలు శిక్ష విధించేలా కొత్త చట్టం తీసుకురానున్నారు. దీనికి అక్కడి మంత్రివర్గం కూడా ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించినట్లు తెలుస్తుంది. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చట్టం తీసుకువచ్చాక తల్లిదండ్రులను పట్టించుకోని కుమారులు, కూతుళ్లపై పోలీసులు కేసులు నమోదు చేసి ఇక జైలుకు పంపించవచ్చు అన్నమాట.

ఇక ఈ చట్టం దేశ వ్యాప్తంగా కూడా వస్తే ఇక వృద్ధ ఆశ్రమాలు అనేవే ఉండవు అని చెప్పాలి.