అమెరికాలో భారీ లాటరీ విజేత ఏమయ్యాడు..???  

Who Is Mega Millions 2019 Winner-nri,telugu Nri News Updates

అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ రెండో లాటరీగా నమోదయిన 10,000 కోట్లు విషయం అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు ఆ లాటరీ తీసుకోవడానికి ఇప్పటివరకూ ఎవరూ రాకపోవడం మిస్టరీగా మారిపోయింది. అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలోని సింప్సన్‌విల్లే అనే పట్టణంలో ఏకంగా 1.5 బిలియన్‌ లాటరీని గతేడాది అక్టోబర్‌ 20 నుంచి 23 మధ్య ఎవరో కొన్నట్టుగా తెలుస్తోంది...

అమెరికాలో భారీ లాటరీ విజేత ఏమయ్యాడు..???-Who Is Mega Millions Lottery 2019 Winner

అయితే లాటరీ గెలిచి చాలా నెలలు గడుస్తున్నా సరే ఇప్పటివరకూ ఎవరూ ఆ సొమ్ము తీసుకోక పోవడం మిస్టరీగా మారింది.అయితే ఈ విషయానికి సంభందించి స్థానికులు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అంత డబ్బు గెలవడంతో ఒక్క సారిగా గుండె ఆగి పోయి ఉంటాడని కొందరు అంటుంటే.

మరి కొందరు..

అతడు బ్రతికి ఉన్నాడా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే లాటరీ గెలిచినా వ్యక్తి ఈ ఏడాది ఏప్రిల్‌ 19లోపు గనుక డబ్బు తీసుకోక పొతే ఆ డబ్బు ఇంకా ఎప్పటికి అతడికి చేరదు ఆ లాటరీ రద్దు కూడా చేస్తారు.