బిగ్‌బాస్ హౌస్‌లో క‌ట్ట‌ప్ప‌... భ‌లే ఫిట్టింగ్ పెట్టాడే

బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ రెండో రోజు కూడా స‌ర‌దా స‌ర‌దాగా గ‌డిచింది.రెండో రోజు కూడా ఎమోష‌న్స్ డోస్ కాస్త ఎక్కువే అయ్యింది.

 Who Is Katappa In Bigg Boss 4, Bigg Boss 4,nagarjuna,task,katappa,painting,noel,-TeluguStop.com

రెండో రోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే క‌రాటే క‌ల్యాణి టీచ‌ర్ అవ‌తారం ఎత్తి క్లాస్ స్టార్ట్ చేశారు.అయితే గంగ‌వ్వ మాత్రం టీచ‌ర్ క‌రాటే క‌ల్యాణిపై పంచ్‌లు వేస్తూ ఓ ఆటాడుకుంది.

తాను 50 ఏళ్లుగా ఇదే స్కూల్లో ఉంటున్నాను.నువ్వు జీతానికి జీతం తీసుకుంటున్నావు.

అంద‌రిని ఫెయిల్ చేస్తున్నావు అంటూ పంచ్ పేల్చ‌డంతో కంటెస్టెంట్లు ఒక‌టే ఇకఇక ప‌క‌ప‌కా న‌వ్వేశారు.

ఇక ఆ త‌ర్వాత బిగ్‌బాస్ 12 మంది కంటెస్టెంట్ల‌ను ఆరు గ్రూపులుగా విభ‌జించి చిత్రం ఎవ‌రిది అనే టాస్క్ ఇస్తే ఆ టాస్క్‌లో 14 వేల పాయింట్ల‌కు గాను ఇంటి స‌భ్యులు 5వేల పాయింట్లు గెలిచారు.

వీరు 9 వేల పాయింట్లు కోల్పోయారు.ఇక హీరో అభిజిత్ క‌ళ్యాణి ద‌గ్గ‌ర‌కు వెళ్లి మీరు గంగ‌వ్వ‌లా శారీ క‌ట్టుకోకండి చూడ‌లేక చ‌స్తాం అంటే అందుకు క‌ళ్యాణి ఒక్క‌సారిగా ఫైర్ అయ్యింది.

మీరు హీరో అయినంత మాత్రానా నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మీరు న‌న్ను ప‌దే పదే టార్గెట్ చేసేలా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ క‌య్ క‌య్ లాడింది.చివ‌ర‌కు అభిజిత్ క‌ల్యాణి ద‌గ్గ‌ర‌కు వెళ్లి సారీ చెప్ప‌డంతో ఆమె కాస్త శాంతించింది.
ఇక ఇంట్లో ఉన్న 14 మంది కంటెస్టెంట్ల‌లో ఒక క‌ట్ట‌ప్ప ఉన్నాడ‌ని బిగ్‌బాస్ పెట్టిన ఫిట్టింగ్‌తో అంద‌రిలోనూ ఒక‌టే ర‌చ్చ‌, చ‌ర్చ న‌డుస్తోంది.

ఆ క‌ట‌ప్ప ఎవ‌రు ఎవ‌రు ? అని అంద‌రూ ఒక్క‌టే గుస‌గుస‌లాడుకుంటున్నారు.మీరు ఎవ‌రిని క‌ట్ట‌ప్ప అనుకుంటున్నారో చెప్పాలంటూ బ్యాలెట్ ఓటింగ్ పెట్టాడు.

ఇందులో హౌస్‌లో ఉన్న 14 మంది ఎక్కువుగా లాస్య, అఖిల్ సార్దక్, సూర్యకిరణ్ పేర్లను ఎక్కువ మంది రాశారు.ఇక క‌ట్ట‌ప్ప ఎవ‌ర‌న్న‌ది బిగ్‌బాస్ బిగ్ స‌స్పెన్స్‌లో పెట్టేశాడు.

ఎక్కువ మంది మాత్రం ఓపెన్‌గా డైరెక్ట‌ర్ సూర్య‌కిర‌ణే క‌ట్ట‌ప్ప అని హౌస్‌లో చ‌ర్చించుకోవ‌డం కనిపించింది.మ‌రి అస‌లు క‌ట్ట‌ప్ప ఎవ‌ర‌న్న‌ది ఈ రోజు రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube