తెలంగాణలో కాంగ్రెస్ రోజురోజుకు బలహీన పడుతోంది.అంతర్గత కుమ్ములాటల వల్ల ప్రజల సమస్యలపై పోరాటం చేయడంలో విఫలం అవడంతో కాంగ్రెస్ ప్రజల్లో పలుచబడింది.
దుబ్బాక ఎన్నికల నుండి మొదలుకొని గ్రేటర్ ఎన్నికల వరకు వరుస ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఢీలా పడిన విషయం తెలిసిందే.అయితే తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సాధారణ జర్నలిస్ట్ కంటే కూడా తక్కువ ఓట్లు నమోదు చేసుకొని కాంగ్రెస్ అభ్యర్థులు ఇరు చోట్లా ఓడిపోయారు.
దీనిని బట్టి చూస్తే పట్టభద్రులు సైతం కాంగ్రెస్ పట్ల విశ్వాసంగా లేరని మనం అర్థం చేసుకోవచ్చు.అయితే రేవంత్ రెడ్డి కూడా బరిలోకి దిగినా ఫలితం శూన్యం ఉండడంతో కాంగ్రెస్ ఇక మునిగిపోతున్న నావ అన్న చందంగా తయారైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అయితే కాంగ్రెస్ లో నాయకత్వ లోపం ప్రధాన కారణంగా తెలుస్తోంది.పీసీసీ అధ్యక్షుడు సరైన వ్యక్తి లేకపోవడం కాంగ్రెస్ కు పెద్ద దెబ్బలా మారిందని, కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం ఎల్లవేళలా కలిసికట్టుగా కృషి చేసే ఆలోచనా విధానం కాంగ్రెస్ నాయకులకు లేకపోవడం వలన వరుస ఓటములు చవి చూస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
భవిష్యత్తులో కాంగ్రెస్ సత్తా చాటుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.