పెద్దతప్పు చేసాడు . సునీల్ ని ఎవరు కాపాడతారు ?

కమెడియన్ సునీల్ హీరో సునీల్ గా మారి చాలా కాలం అయినా మనందరికీ సునీల్ పేరు చెప్పగానే భీమవరం యాసలో కామెడీ చేస్తూ కడుపుబ్బా నవ్వించే కమెడియన్ ఫస్ట్ గుర్తొస్తాడు తరవాతే అతను హీరో అనే విషయం గుర్తుకు వస్తుంది.కాస్త క్రేజ్ రాగానే దాన్ని నమ్ముకుని హీరో అయిపోయిన మనోడు మధ్యలో ఎక్కడా కామెడీ క్యారెక్టర్ లు చెయ్యనే లేదు.

 Who Is Going To Save Suneel ?-TeluguStop.com

స్టార్ హీరోల సినిమాల్లో నటించేప్పుడు దర్శక నిర్మాతల వల్ల ఇబ్బంది ఫీల్ అయ్యే హీరోగా మారానని కటింగ్స్ ఇచ్చినా సునీల్ ఇప్పుడు హీరో.అయితే కమెడియన్ గా ఎంత హిట్ అయ్యాడో హీరోగా అంత ఫ్లాప్ అవుతున్నాడు.

తీస్తున్న సినిమాలనీ లేక్కేసుకుంటే సునీల్ హీరోగా ప్లాప్ అయినట్టే చెప్పాలి.

దిల్ రాజు నిర్మాణంలో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టే.

అందులోనే దిల్ రాజు ఊరకనే సినిమాలు తీసేయడు.మరి అలాంటి శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ టీం అంతా కలిసి రెడీ చేసిన సినిమా కథ ఇలా కలగూరలా ఉందే అన్న డౌట్ వారికి రాలేదు అనుకుంటా.

కాస్త కూస్తో సునీల్ కు డౌట్ వచ్చినా దిల్ రాజు మీద ఉన్న నమ్మకంతో పాత కథ అయినా స్పెషల్ ట్రీట్ మెంట్ ఇప్పిస్తాడనుకున్నారు.కానీ అది కూడా బోల్తా కొట్టేసింది.

మొదటి షో నుంచే టాక్ చాలా నీరసంగా వచ్చింది .ఓపెనింగ్స్ బాగున్నా సినిమా లో విషయం లేక కృష్ణాష్టమి పస తప్పింది.ఇక ఈ ప్లాపుల పరంపర నుంచే దిల్ రాజే కాపాడలేక పోయాడు అంటే సునీల్ ని ఎవరు కపాడతారో ?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube