‘బిగ్ బాస్’ నుంచి ఈసారి ఎలిమినేట్ అయేది ఎవరో తెలుసా ? కారణాలు ఇవే !

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ రియాలిటీ షోగా ‘బిగ్ బాస్’ పేరు గాంచిన సంగతి అందరికీ విదితమే.ప్రజెంట్ ఈషో సీజన్ ఫైవ్ రన్ అవుతోంది.

 Who Is Going To Eliminate This Week , Big Boss, Hameeda, Lobo, Big Boss Telugu ,-TeluguStop.com

షోకు టాలీవుడ్ అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.‘బిగ్ బాస్’ హౌజ్‌లోకి ఈసారి 19 మంది సభ్యులను తీసుకోగా ఆల్రెడీ నలుగురు ఎలిమినేట్ అయ్యారు.

ఫస్ట్ వీక్‌లో సరయు, రెండో వారంలో ఉమా దేవి, మూడో వారంలో లహరి, ఫోర్త్ వీక్‌లో నటరాజ్ మాస్టర్ హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయారు.

‘బిగ్ బాస్’ హౌజ్‌లో ప్రస్తుతం పదిహేను మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఐదో వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.లోబో బయటకు వెళ్లే చాన్సెస్ ఉన్నాయనే టాక్ వినిపించినప్పటికీ ఇప్పుడు హమీదా పేరు వినబడుతోంది.

అందరి కంటే కూడా తక్కువ మార్కులు హమీదాకు వచ్చినట్లు సమాచారం.ఇకపోతే ఈ వారం ఎలిమినేషన్ ఉండబోదనే వార్త కూడా హల్ చల్ అవుతోంది.

మొత్తంగా ఎలిమినేషన్ ఉంటుందా? ఉండదా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే ‘దసరా’ పండుగ సందర్భంగా ఎలిమినేట్ అయ్యేది ఎవరో అనే విషయం తెలుసుకునేందుకుగాను ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

Telugu Big Boss, Big Boss Telugu, Hameeda, Hamida, Latest, Lobo, Eliminate-Telug

ఇకపోతే ఈ వారం ‘బిగ్ బాస్’ హౌజ్ సభ్యులతో ‘కొండ పొలం’ మూవీ యూనిట్ టీమ్ ముచ్చటించనుంది.ఇందుకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా వారు ఆల్రెడీ ఇన్ స్టా గ్రామ్ వేదికగా విడుదల చేశారు.ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కొండ పొలం’ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్, బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్లుగా నటించారు.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండ పొలం’ నవలం ఆధారంగా ఈ సినిమా తీశారు.‘ఓబులమ్మ’గా రకుల్ చక్కటి పాత్రను పోషించాడని, ‘రవీంద్ర’గా పంజా వైష్ణవ్ తేజ్ అదరగొట్టేశాడని సినిమా చూసిన వారు ప్రశంసిస్తున్నారు.

ఈ చిత్రాన్ని నలభై రోజుల్లోనే వికారబాద్ అడవుల్లో కంప్లీట్ చేసినట్లు డైరెక్టర్ క్రిష్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube