కర్ణాటకలో కుర్చీలాట.. సీఎం ఎవరో తెలుసా ..?       2018-05-15   06:33:26  IST  Bhanu C

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ముందే కర్ణాటకలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భాజపా నుంచి మొదటి నుంచి యాడ్యురప్ప పేరు ప్రచారం లో ఉన్నా … తాజా సమీకరణాల ప్రకారం ఆ స్థానంలో అనంతకుమార్‌ హెగ్డే , శ్రీ రాములు పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే వీరిలో ఎవరికీ సీఎం కుర్చీ దక్కుతుంది అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అనూహ్యంగా తెరమీదకు వచ్చిన రెండు పేర్లు వెనుక ఎదో రాజకీయమే దాగి ఉంది అనేది అర్ధం అవుతోంది. వీరికి బీజేపీ పెద్దల ఆశీర్వాదాలు బలంగా ఉన్నాయని అందుకే యాడ్యురప్ప కు ప్రత్యామ్న్యాయం గా ఈ పేర్లు కూడా పరిశీలనకు వచ్చినట్టు సమాచారం.

ఇప్పటికే బీజేపీ దాదాపు 104 సీట్లలో ముందంజలో ఉంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 78 స్థానాల్లో ముందంజలో ఉండగా మరో అదిపెద్ద పార్టీ జేడీఎస్ 38 కు ఇతరులు 2తో ఉన్నారు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది.ఇక మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరవడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి..అయితే మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా వచ్చి బీజేపీ ఉన్నా కాంగ్రెస్ నుంచీ 10 మంది ఎమ్మెల్యేలు బిజెపి లోకి మరియు జేడీయు నుంచీ 7 ఎమ్మెల్యేలు బిజెపి లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఈ లెక్కలో చూసుకుంటే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటక సీఎం ఫీటం మీద కూర్చుంటుంది అని అర్థం అవుతోంది..

అయితే కాంగ్రెస్ నుంచీ జేడీయు నుంచీ ఎమ్మెల్యేలు బీజేపీ లోకి ఎమ్మెల్యేలని తీసుకువచ్చే భాద్యత అమిత్ షా గాలికి అప్పగించారని టాక్ కూడా వినిపిస్తోంది..ఇదిలావుంటే కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో భేటీ అయ్యారు. జేడీఎస్ తో పొత్తు పెట్టుకోవాలా లేక ఏమి చేయాలనే విషయంపై సమాలోచనలు చేస్తున్నారు..మరికాసేపట్లో ప్రకాష్ జవదేకర్ బెంగుళూరు బయలుదేరనున్నారు. అక్కడే సీఎం అభ్యర్థి ఎవరు అనేది డిసైడ్ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సమర్ధత , విధేయత ఆధారంగానే ఎంపిక ఉండబోతుంది అనేది వాస్తవం.