బీకాంలో ఫిజిక్స్ వెన‌క ఎవ‌రున్నారు.. బెజ‌వాడ‌లో ఏం జ‌రుగుతోంది ?

రాజ‌కీయాలు అన్నాక ఎత్తులు, పై ఎత్తులు చాలా కామ‌న్‌.ఒక‌రి ఒక‌రిపై ఎత్తు వేస్తే.

 Who Is Behind Jaleel Khan What Is Happening In Bejawada Tdp ,ap,ap Political New-TeluguStop.com

వెంట‌నే మ‌రో నేత పై ఎత్తు వేస్తుంటాడు.తాజాగా బెజ‌వాడ టీడీపీలో చెల‌రేగిన ముస‌లం చంద్ర‌బాబు వార్నింగ్‌తో స‌ర్దుకున్న‌ట్టే ఉన్నా ఇది భ‌విష్య‌త్తులో మ‌రింత రాజుకోవ‌డం ఖాయంగా కనిపిస్తోంది.

ఎంపీ కేశినేని నానికి వ్య‌తిరేకంగా ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌తో పాటు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వ‌ర‌రావు, మ‌రో నేత షేక్ నాగుల్ మీరా ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టారు.చివ‌ర‌కు చంద్ర‌బాబు టూర్‌లో నాని ఉంటే.

తాము ప్ర‌చారం కూడా చేయ‌మ‌ని కండీష‌న్ పెట్టారు.

ఎంపీ కేశినేని నాని, బుద్దా వెంకన్నల మధ్య ఆధిపత్య పోరు ఈనాటిది కాదు.

బుద్దా వెంకన్న అర్బన్ పార్టీ ఇన్ ఛార్జిగా ఉన్న నాటి నుంచే ఈ పోరు ప్రారంభమయింది.ముందు వీరిద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య ఉన్నా ఆ త‌ర్వాత తేడా రావ‌డంతో వార్ మ‌రింత ముదిరిపోయింది.

ఈ వార్‌లో తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ ఒక్క‌రు మాత్ర‌మే కేశినేనికి స‌పోర్ట్‌గా ఉన్నార‌ని అంటున్నారు.అయితే నిన్న‌టి వ‌ర‌కు సైలెంట్‌గా ఉన్న ప‌శ్చిమ మాజీ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ ఒక్క‌సారిగా యాక్టివ్ అయ్యారు.

Telugu Ap, Chandra Babu, Latest, War, Tdp, Vijayawada, Ysrcp, Ysrcp Ministers-Te

బీకాంలో ఫిజిక్స్‌గా పాపుల‌ర్ అయ్యి మంత్రి ప‌ద‌వి ఛాన్స్ మిస్ చేసుకున్న ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో త‌న కుమార్తెను పోటీ చేయించారు.ఆ త‌ర్వాత సైలెంట్‌గా ఉన్న ఆయ‌న్ను ఇప్పుడు యాక్టివ్ చేయించింది ఎంపీ కేశినేనే అంటున్నారు.ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో బుద్ధా వెంక‌న్న‌కు, నాగుల్ మీరాకు చెక్ పెట్టేందుకే నాని జలీల్‌ఖాన్‌ను ఇప్పుడు తెర‌మీద‌కు తెచ్చి ఆయ‌న‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని అంటున్నారు.ఎంపీ అండ‌తో నిన్న‌టి వ‌ర‌కు సైలెంట్‌గా ఉన్న జ‌లీల్ ఇప్పుడు విజృంభిస్తున్నారు.

ఏదేమైనా బెజవాడ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసే సమయానికి తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు మరింత ముదిరే అవకాశముంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube