జగ్గారెడ్డి వెనుక ఎవరు..? టీఆర్ఎస్ లో హరీష్ హవా తగ్గిపోతోందా ....?

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఎవరికీ అంతుపట్టడం లేదు.ఆ పార్టీలో కీలక నేతగా ఉంటూ వచ్చిన హరీష్ రావు ను క్రమంగా పార్టీ నుంచి దూరం చేసే ప్రక్రియ మొదలైనట్లుగా కనిపిస్తుంది.

 Who Is Behind Jagga Reddy To Decrease Harish Rao Status-TeluguStop.com

ఇప్పటికే సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన హరీష్ రావుకు మంత్రి పదవి వస్తుందా రాదా అని ఊహాగానాలు చెలరేగుతుండగానే… ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా బరిలో దిగబోతున్నట్టు వార్తలు వచ్చాయి.కానీ కాంగ్రెస్ పార్టీ లో కీలకంగా ఉన్న జగ్గారెడ్డి అదేపనిగా హరీష్ రావు ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తుండడం చర్చనీయాంశమవుతోంది.

హరీష్ ను జగ్గారెడ్డి ఎన్ని మాటలు అంటున్నా… టీఆర్ఎస్ వైపు నుంచి కనీసం స్పందన కనిపించడం లేదు.

ఒకవైపు హరీష్ ను తిడుతూనే కేసీఆర్ ను పొగడ్తల్లో ముంచేయడం అందరిలోనూ ఆసక్తి అనుమానాలు కలిగిస్తున్నాయి.అసలు హరీష్ ను దగ్గర టిఆర్ఎస్ పెద్దల హస్తం ఉందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు రేకెత్తుతున్నాయి.కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు కనిపించకపోవడంతో… టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు లేక కాంగ్రెస్ లోనే ఉంటూ … టీఆర్ఎస్ మద్దతుదారుడిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడా అనే సందేహాలు కలుగుతున్నాయి.

అందుకోసమే ఈ విధంగా హరీష్ ను తిడుతూ కేసీఆర్ ను పొగుడుతూ జగ్గారెడ్డి కొత్త రాజకీయం నడుపుతున్నట్టుగా కనిపిస్తోంది.

ఇక హరీష్ హావ పార్టీలో తగ్గుముఖం పట్టడంతో … ఇప్పుడు రాజకీయాలన్నీ కేటీఆర్ కేంద్రంగానే జరుగుతున్నాయి.ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించడంతో… ప్రస్తుతం పార్టీలో నెంబర్ 2 స్థానంలో కొనసాగుతున్నారు.ఇక కేటీఆర్ కి ఆ అవకాశం ఇవ్వడంతోనే హరీష్ హవా తగ్గించేసినట్టు అందరికి అర్ధం అయిపొయింది.

అయితే ఇంత తంతంగం జరుగుతున్న హరీష్ మాత్రం పెద్దగా స్పందించడంలేదు.కాకపోతే లోలోపల ఆందోళన చెందుతూనే… జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాడు.కాకపోతే తెలంగాణాలో పార్టీ అదిఆకారంలో ఉండడం… భవిష్యత్తులోనూ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశం ఉండడంతో… సైలెంట్ గా ఉంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube