ఇంతకు బంగార్రాజు ఎవరు భయ్యా?

అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బంగార్రాజు సినిమా చాలా స్పీడ్‌ గా తెరకెక్కుతోంది.మూడు నాలుగు ఏళ్లుగా అదుగో ఇదుగో అంటూ వచ్చిన బంగార్రాజును మూడు నెలల క్రితం ప్రారంభించి అప్పుడే ముగించేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.

 Who Is Bangarraju In Nagarjuna And Naga Chaitanya, Bangarraju , Nagarjuna , Na-TeluguStop.com

ప్యాచ్ వర్క్‌ మినహా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయినట్లే అంటున్నారు.ఇక ఈ సినిమా లో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు.

రమ్యకృష్ణ మరియు కృతి శెట్టిలు కనిపించబోతున్నారు.అందరు అనుకున్నట్లుగానే నాగ చైతన్యకు జోడీగా ముద్దుగుమ్మ కృతిశెట్టి కనిపించబోతుంది.

ఇక రమ్యకృష్ణ ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా కనిపించబోతుంది.బంగార్రాజు సినిమా లో నాగార్జున ఎలా ఉండబోతున్నాడు అనేది ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

మళ్లీ ఇప్పుడు బంగార్రాజు లుక్‌ ను రివీల్‌ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.దాంతో ఇంతకు బంగార్రాజు నాగార్జుననా లేదంటే నాగ చైతన్యనా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నాగార్జున బంగార్రాజు పక్కా అయితే నాగ చైతన్య పాత్ర ఏంటీ అనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది.గత కొన్ని రోజులుగా బయటకు వస్తున్న వార్తలను బట్టి చూస్తుంటే నాగ చైతన్య ఈ సినిమా లో బంగార్రాజు గా కనిపించబోతున్నాడు.

చైతూ పాత్ర పేరు కూడా బంగార్రాజు అయ్యి ఉంటుందా లేదంటే తండ్రి కొడుకులు కూడా ఒకే పాత్రను వేరు వేరు వయసుల వేరియేషన్స్ తో చేస్తున్నారా అనేది కన్ఫ్యూజన్‌ గా ఉంది.

Telugu Bangarraju, Krithi Shetty, Krthi Shetty, Naga Chaitanya, Nagarjuna, Ramya

ఒక వేళ ఒకే పాత్రను ఇద్దరు చేస్తూ ఉంటే ఇద్దరు స్క్రీన్‌ మీద మనకు కలిసి కనిపించే అవకాశం లేదు.లేదా తాత మనువడిగా కనిపించబోతే మాత్రం అభిమానులకు కన్నుల పండుగ ఖాయం.మొత్తానికి సినిమాలో ఇద్దరు కూడా బంగార్రాజులే అయ్యి ఉంటారని అనిపిస్తుంది.

అసలు విషయం ఏంటీ అంటే రెండు రోజుల్లో విడుదల కాబోతున్న టీజర్ మరియు ఫస్ట్‌ లుక్ తో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube