నందమూరి బాలయ్యకు అభిమానులు చాలా మంది ఉంటారు.అలాగే ఆయన్ను విమర్శించే వారు కూడా చాలా మందే ఉంటారు అనడంలో సందేహం లేదు.
ఇటీవల ఆదిత్య 369 సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బాలయ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏఆర్ రహమాన్ ను తక్కువ చేసి మాట్లాడాడు.ఏఆర్ రహమాన్ ఎవరు అన్నట్లుగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
బాలయ్యకు ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన రహమాన్ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నాడు అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు.బాలయ్య వ్యాఖ్యలకు నిరసనగా సోషల్ మీడియాలో రహమాన్ అభిమానులు హూఈజ్ బాలయ్య అనే హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు.
ట్విట్టర్ లో ట్రెండ్ అయిన హూ ఈజ్ బాలయ్య హ్యాష్ ట్యాగ్ కు వ్యతిరేకంగా బాలయ్య అభిమానులు కూడా ధీటుగా స్పందించారు.హూ ఈజ్ బాలయ్య అంటే ఈ అద్బుతమైన సినిమాలు చూడండ్రా మీకు తెలుస్తుంది అంటూ కొన్ని బాలయ్య నటించిన సినిమాలను షేర్ చేయడంతో పాటు బాలయ్య పిక్స్ ను ఆయన మంచి తనంకు సంబంధించిన విషయాలను షేర్ చేశాడు.
మొత్తానికి బాలయ్య ను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వారు వీరు కలిసి ట్రెండ్ చేశారు అనడంలో సందేహం లేదు.
నిన్న రాత్రి అంతా కూడా బాలయ్య గురించి కొన్ని వేల ట్వీట్స్ ను నెటిజన్స్ షేర్ చేయడం ద్వారా జాతీయ స్థాయిలో హూ ఈజ్ బాలయ్య హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది.ఇంకా కూడా రహమాన్ అభిమానులు బాలయ్య ను ట్రోల్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.ఈ వివాదం ముందు ముందు ఎక్కడకు దారి తీస్తుందో అంటూ నెటిజన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.