చంద్రబాబు తరవాతి స్థానం లో ఎవరు రాబోతున్నారు ?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వర్గాలతో పాటు అధికార పార్టీ లో ఇప్పుడు కొత్త చర్చ నెలకొంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు క్రియాశీలంగా పనిచేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఈ కొత్త చర్చ తెరమీదకు వచ్చింది.

 Who Is After Chandrababu Naidu ?-TeluguStop.com

పాలనా పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రి తరవాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిది చాలా కీలకమైన పాత్ర.ఇందులో కృష్ణా రావు కొనసాగుతూ ఉన్నారు కాగ ఆయన పదవీ కాలం ఈ నెలాఖరు కి ముగుస్తుంది.

ఆయన రిటైర్ అవుతారు అనే వాదన నడుస్తోంది, మరొక పక్క సర్వీసు పొడిగించే అవకాశం తక్కువే.ఆయన రిటైరయిన తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఎంపికవుతారు? అంటూ ఏపీలో జోరుగా చర్చసాగుతోంది.ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ని కృష్ణా రావు కలిసారు అప్పుడు బాబు చేపడుతున్న కార్యక్రమాలతో పాటు రిటైర్మెంట్ అంశాన్ని కూడా మాట్లాడారట.కృష్ణా రావు వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ఆయన పదవిని పొడిగించడం కోసం ఎలాంటి ప్రత్యెక ప్రయత్నాలూ చెయ్యడం లేదట.

ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆయన సర్వీసులను పొడిగించిన పక్షంలో తక్షణం కొత్త చీఫ్ సెక్రటరీ ఎంపిక జరగదు.కృష్ణా రావు రిటైర్ అయ్యాక ఆ స్థానం లో ఎవరు వస్తారు అంటే అందరూ ఎస్ పీ ఠక్కర్ పేరు చెబుతున్నారు.

లేదా విశ్వనాథం – ఎన్ రమేష్ కుమార్ – లింగరాజు పాణిగ్రాహి – టి విజయకుమార్ – ఎల్వీ సుబ్రహ్మణ్యం – అజేయకల్లాం – దినేష్ కుమార్ పేర్లు వినపడుతున్నాయి.నెలాఖరు వరకూ చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube