సాయిరెడ్డి పాద‌యాత్రకు దెబ్బ కొట్టిందెవ‌రు... మైలేజ్ మైన‌స్సే అయ్యిందా ?

వైసీపీ కీల‌క నాయ‌కుడు.ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా సాగించిన పాద‌యాత్ర స‌క్సెస్ అయింది.

 Who Hit Saireddy Padayatra Is There Any Result With That Padayatra,ap,ap Politic-TeluguStop.com

ఆయ‌న అనుకున్న‌ట్టుగానే పాద‌యాత్ర‌ను ముందుకు న‌డిపించారు.ఎక్క‌డెక్క‌డి నుంచో వైసీపీ నాయ‌కుల‌ను కూడ‌గ‌ట్టి మ‌రీ.

విశాఖ‌కు తీసుకువ‌చ్చి.పాద‌యాత్ర చేప‌ట్టారు.

ఐదు నియోజకవర్గాల మీదుగా దాదాపు 25 కి.మీ మేర ఆయన పాదయాత్ర చేపట్టారు.వైసీపీ నేతలు, శ్రేణులు, సామాన్య ప్రజలతో గాజువాక చేరుకున్నారు.గాజువాక ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున పూలతో స్వాగతం పలికారు.విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటు నినాదాలు చేశారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.

దీనివ‌ల్ల వ‌చ్చే ఫ‌లితం ఏంట‌నేది ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాం శంగా మారింది.ఎందుకంటే.

విజ‌య‌సాయి రెడ్డి చేసిన పాద‌యాత్ర వ‌ల్ల స్టీల్ ప్లాంట్ పై తీసుకున్న నిర్ణ యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకునే అవ‌కాశం లేద‌ని పెద్ద ఎత్తున గుస‌గుస సొంత పార్టీలోనే విని పిస్తోంది.వాస్త‌వానికి పాద‌యాత్ర ద్వారా దీనిని సాధించ‌లేమ‌ని.

సాయిరెడ్డి కూడా ముందుగానే చెప్పారు.అయితే.

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు.రాజీనామా చేయ‌డం, ప‌ల్లా శ్రీనివాస‌రావు.

ఆమ‌ర‌ణ దీక్ష‌కు కూర్చోవ‌డం వంటివి పెద్ద ఎత్తున హైలెట్ అయ్యాయి.

Telugu Ap, Latest, Padayatra, Posco, Vizag Steel, Ysrcp, Ysrcp Leadders, Ysrcp M

ఈ నేప‌థ్యంలో వైసీపీ వెనుక‌బ‌డింద‌నే కామెంట్లు వ‌చ్చాయి.వీటిని త‌ట్టుకుని నిల‌బ‌డ‌డంతోపాటు.తాను ఆది నుంచి చూస్తున్న‌విశాఖ‌లో వైసీపీ వెనుక‌బ‌డితే.

త‌న‌కు బ్యాడ్ నేమ్ వ‌చ్చే అవ‌కాశంతో పాటు.ప్ర‌స్తు తం జ‌రుగుతున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పార్టీ ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటుంద‌ని గుర్తించిన సాయి రెడ్డి.

పాద‌యాత్ర‌కు రెడీ అయ్యార‌ని వైసీపీలో టాక్ వినిపిస్తోంది.

ముందు నుంచి తాను విశాఖ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతుండ‌డం.

ఇప్పుడు ఉక్కు పోరాటం విష‌యంలో తాను వెనుబ‌డితే.ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు వ‌స్తాయ‌ని ఊహించే ఈ పాద‌యాత్ర చేసినా, ఫ‌లితం మాత్రం క‌నిపించ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది.

మ‌రి సాయిరెడ్డి దీనిపై ఏం చెబుతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube