దేశాలకు డబ్ల్యూ హెచ్ వో హెచ్చరిక, లాక్ డౌన్ ఎత్తివేస్తే మరింత

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భారీ విపత్తును సృష్టించిన విషయం తెలిసిందే.దీనితో ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు లాక్ డౌన్ విధించి ఈ వైరస్ ను అరికట్టడానికి తగు చర్యలు తీసుకుంది.

 Lockdown, Who, Who President Tredos, Countries, Exit Lockdown,  Who Urges 'extre-TeluguStop.com

అయితే ఇప్పుడిప్పుడే కొద్ది కొద్ది గా కేసులు తగ్గుతున్న వేళ.కొన్ని దేశాలు ఆంక్షలను సడలిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్నారు.నిబంధనలను సులభతరం చేస్తున్న దేశాలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.వైరస్ వేగాన్ని తగ్గించడంలో కొన్ని దేశాలు సఫలం అయ్యాయని, దీని వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడారని డబ్ల్యూహెచ్వో డైరక్టర్ టెడ్రోస్ తెలిపారు.

జనీవాలో వర్చువల్ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.ఆంక్షలను ఎత్తివేయడం అంటే అది ఆశకు సంకేతమని,కానీ అన్ని దేశాలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వల్ల ఇప్పటికే రెండు లక్షల 80 వేల మంది మరణించిన విషయం విదితమే.సుమారు 40 లక్షల మందికి వైరస్ సంక్రమించింది.

ప్రజా ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రభుత్వాలను కోరుతుంది.కొత్త కేసులను గుర్తించి, వారిని ఐసోలేట్ చేసి, చికిత్స అందించాలని,దీని వల్ల రెండో దఫా కేసుల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నట్లు వారు అభిప్రాయపడుతున్నారు.

Telugu Exit Lockdown, Lockdown, Tredos-

మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కొన్ని దేశాలు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేశాయని, కానీ కొన్ని దేశాలు పట్టించుకోలేదన్నారు.కోవిడ్19 పట్ల కొందరికే యాంటీ బాడీలు ఉన్నట్లు సీరోలాజికల్ అధ్యయనాల ఆధారంగా తెలుస్తోందని, అంటే చాలా వరకు జనాభాకు వైరస్ సంక్రమించే అవకాశాలు ఉన్నట్లు టెడ్రోస్ అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube