చంద్ర‌బాబు శ‌ప‌థాన్ని ముందుకు తీసుకెళ్లేది ఎవ‌రు..?

చంద్రబాబు నాయుడు ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ గా వ్యవహరిస్తున్నారు.అంతే కాకుండా ఆయన విభజిత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు.

 Who Did Not Carry The Chandrababu Curse Forward  Chandrababu, Tdp, Assembly , Bh-TeluguStop.com

కానీ 2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ చేతిలో దారుణంగా ఆయన పార్టీ ఓడిపోయింది.దాంతో చంద్రబాబు సీఎం పదవి కాస్త పోయింది.

దీంతో ఇప్పుడు ఆయన పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.ఇంత వరకూ బాగానే ఉన్నా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ పార్టీని తమ పార్టీ వ్యక్తులను రాజకీయంగా వేధిస్తోందని ఇప్పటికే చాలా మంది టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

ఈ ఆరోపణలకు బలం చేకూరేలా పోయిన నెలలో ఒక ఘటన జరిగింది.చంద్రబాబు నాయుడు తనకు అసెంబ్లీలో అన్యాయం జరిగిందని తన భార్యను అవమానించారని ఆరోపిస్తూ మరలా తాను ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు.

కానీ ప్రస్తుతం ఈ శపథం విషయం టీడీపీ పార్టీలోని చాలా మంది నాయకులు పట్టించుకోవడం లేదని టాక్ నడుస్తోంది.బాబు శపథం చేసి దాదాపు నెల రోజులవుతున్నా ఇంకా టీడీపీ నాయకులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదట.

కేవలం చంద్రబాబు మాత్రమే ఈ విషయం గురించి ప్రస్తావిస్తున్నారని మిగతా నాయకులు ఎవరూ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని అందరూ చర్చించుకుంటున్నారు.

Telugu Ap Potics, Assembly, Bhuvaneswari, Chandrababu, Ys Jagan, Ysrcp-Telugu Po

ఇలా అయితే టీడీపీ పార్టీ 2024 ఎన్నికల్లోగెలవడం సాధ్యం కాదని అంచనాలు వేస్తున్నారు.చంద్రబాబు ఇటీవల నెల్లూరు, అనంతపురం వంటి జిల్లాల నాయకులతో భేటీ అయ్యారు.ఈ భేటీలో ఆయన అసెంబ్లీ శపథం విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

ఈ శపథం విషయంలో సీరియస్ గా లేని నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేస్తున్నారు.కొందరికి క్లాస్ పీకుతున్నారు.మరి చంద్రబాబు శపథం నెరవేరుతుందో లేదో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube