కృష్ణ‌దాస్‌కు దెబ్బేస్తోందెవ‌రు... వైసీపీ నేత‌ల‌ బెంబేలు...!

ఏపీ డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌కు నెమ్మ‌ద‌స్తుడిగా మంచి పేరుంది.గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సీనియ‌ర్‌, మంచి వాక్చాతుర్యం ఉన్న ధ‌ర్మాన ప్ర‌సాద‌రావును కాద‌ని మ‌రీ కృష్ణ‌దాస్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో పాటు ఏకంగా డిప్యూటీ సీఎం ప‌ద‌వి కూడా ఇచ్చారు.

 Who Degrading Krishnadas..ycp Leaders Discussion, Ycp, Ysrcp Leaders, Krishna Da-TeluguStop.com

అయితే ఇప్పుడు ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌ర‌స‌న్న‌పేట‌లో ఆయ‌న‌కు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తోన్న ప‌రిస్థితి.నియోజ‌క‌వ‌ర్గంలో ఓ వ్య‌క్తి షాడో మినిస్ట‌ర్ మాదిరిగా మారి ప‌నుల‌న్ని త‌న క‌నుస‌న్న‌ల్లో జ‌రిగేలా చ‌క్రం తిప్ప‌డంతో పాటు చివ‌ర‌కు బ‌దిలీల వ్య‌వ‌హారాలను కూడా త‌న క‌నుస‌న్న‌ల్లోనే న‌డిపిస్తున్నార‌ట‌.

ఇంత‌కు స‌ద‌రు వ్య‌క్తి మంత్రికి పీఎస్ కాదు.పీఆర్వో కాదు.

చివ‌ర‌కు అటెండ‌ర్ అంత‌క‌న్నా కాద‌ట‌.

మ‌రి డిప్యూటీ సీఎం ద‌గ్గ‌ర ఈ రేంజ్లో చ‌క్రం తిప్పుతోన్న ఆ వ్య‌క్తి గురించే ఇప్పుడు న‌ర‌స‌న్నపేట నుంచి అమ‌రావ‌తి వ‌ర‌కు ఎక్క‌డ చూసినా క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకుంటోన్న ప‌రిస్థితి.

మ‌రి ఆ షాడో వ్య‌క్తి ఎవ‌రో కాదు.ప్ర‌స్తుతం న‌ర‌స‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, పార్టీ వ్య‌వ‌హారాలు అన్ని ఆయ‌న కుమారుడు కృష్ణ‌చైత‌న్య చూస్తున్నారు.అయితే కుమారుడి విష‌యంలో కృష్ణ‌దాస్‌కు కంప్లెంట్లు లేక‌పోయినా… మంత్రి కుమారుల‌కు స‌న్నిహితుడిగా గుర్తింపు ఉన్న ఓ వ్య‌క్తి వ‌ల్లే ఇప్పుడు ఎక్క‌డా లేని చిక్కు వ‌చ్చి ప‌డుతోంద‌ట‌.

Telugu Ap Cm, Degrade, Deputy Cm, Dharmankrishna, Krishna Das, Suspend, Tdp, Ycp

స‌ద‌రు మంత్రి కుమారుల స‌న్నిహితుడు చేస్తోన్న వ్య‌వ‌హారాల‌తో ఇప్పుడు డిప్యూటీ సీఎంతో పాటు ఆయ‌న ఫ్యామిలీకే పెద్ద మాయ‌ని మ‌చ్చ వ‌చ్చే ప‌రిస్థితి ఉందంట‌.గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వంలో తీవ్రంగా అవినీతి చేసిన ఓ ఏఈ స‌స్పెండ్ అయ్యాడు.ఇప్పుడు స‌ద‌రు ఏఈ కుమారుడే కృష్ణ‌దాస్ కుమారుల అనుచ‌రుడిగా ఉంటూ ఆయ‌న ఆఫీస్‌లో షాడో మినిస్ట‌ర్ అవ‌తారం ఎత్తేసి నానా ర‌చ్చ చేస్తోన్న ప‌రిస్థితి.

అవినీతి ఆరోప‌ణ‌ల‌తో స‌స్పెండ్ అయిన త‌న తండ్రికి ఏకంగా జిల్లా కేంద్రంలోనే పోస్టింగ్ ఇప్పించుకున్నాడ‌ట‌.

ఇక ఇప్పుడు మంత్రి పేరు చెప్పుకుని ఆ షాడో వ్య‌క్తి చేస్తోన్న పైర‌వీల‌కు అంతే లేకుండా పోయిందంటున్నారు.

కృష్ణ‌దాస్ ఆయ‌న కుమారుడు ఉన్నా కూడా ఈ విష‌యాన్ని డిప్యూటీ సీఎంకు చెప్పే సాహ‌సం ఎవ్వ‌రూ చేయ‌క‌పోవ‌డంతో స‌ద‌రు షాడో వ్య‌క్తికి అడ్డు అదుపు లేకుండా పోయిందంటున్నారు.చివ‌ర‌కు ఆ షాడో వ‌ల్ల కేడ‌ర్ సైతం బెంబేలెత్తుతోన్న ప‌రిస్థితి.

మ‌రి ఈ విష‌యంపై ఇప్ప‌ట‌కి అయినా కృష్ణ‌దాస్ దృష్టి పెడ‌తారేమో ?  చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube