గాలి ద్వారా కూడా కరోనా,క్లారిటీ ఇచ్చిన డబ్ల్యు హెచ్ ఓ

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లాడిస్తుంది.ఈ మహమ్మారికి అగ్రరాజ్యం సైతం చిగురుటాకులా ఒణికి పోతున్న విషయం తెలిసిందే.

అయితే ఇటీవల అధ్యయనాల్లో వెలుగు చూసిన అంశాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.ఈ మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది అని అందుకే ఎప్పుడు ఎవరి నుంచి ఈ వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందుతుందో చెప్పనలవి కాదు అంటూ కొందరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో దాదాపు 2 వందల మందికి పైగా శాస్త్రవేత్తలు డబ్ల్యు హెచ్ ఓ కు లేఖలు కూడా రాశారు.

అయితే ప్రచారాలపై డబ్ల్యు హెచ్ ఓ క్లారిటీ ఇచ్చింది.పరిశీలన తరువాత అర్ధమైన విషయాల గురించి ఆ సంస్థ స్పష్టత ఇచ్చింది.

గాలి ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది అన్న విషయం అంగీకరించిన ఆ సంస్థ అయితే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఈ వైరస్ వ్యాప్తి అనేది ఉంటుంది అని స్పష్టం చేసింది.

అంటే రద్దీ ఎక్కువగా ఉండే ఇండోర్ ప్రదేశాలలో అలానే వెంటిలేషన్ సరిగా లేని ప్రదేశాల్లో ఈ వైరస్ గాలిద్వారా కూడా వ్యాపిస్తుంది అని తెలిపింది.

అయితే ఓపెన్ ఏరియాల్లో ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందడానికి అవకాశాలు చాలా తక్కువ అని ఆ సంస్థ తెలిపింది.

కేవలం అత్యవసర పరిస్థితుల్లో రోగులను వెంటిలేషన్‌పై ఉంచిన సందర్భాల్లోనే ఈ వైరస్ గాలి ద్వారా ఇతరులకు వ్యాప్తిస్తుంది అని వాదిస్తూ వచ్చిన WHO మరోసారి పునః పరిశీలించిన ఆ సంస్థ పై అభిప్రాయాలను వ్యక్తం చేసింది.

Dosa Crop : వేసవికాలంలో దోస పంట సాగు చేస్తే శ్రమ తక్కువ, ఆదాయం ఎక్కువ..!