గాలి ద్వారా కూడా కరోనా,క్లారిటీ ఇచ్చిన డబ్ల్యు హెచ్ ఓ  

Corona Virus, Coronavirus spread through air, WHO, WHO gives clarity on airborne spread, airborne spread - Telugu Airborne Spread, Corona Virus, Coronavirus Spread Through Air, Who, Who Gives Clarity On Airborne Spread

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లాడిస్తుంది.ఈ మహమ్మారికి అగ్రరాజ్యం సైతం చిగురుటాకులా ఒణికి పోతున్న విషయం తెలిసిందే.

 Who Coronavirus Airborne Spread

అయితే ఇటీవల అధ్యయనాల్లో వెలుగు చూసిన అంశాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.ఈ మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది అని అందుకే ఎప్పుడు ఎవరి నుంచి ఈ వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందుతుందో చెప్పనలవి కాదు అంటూ కొందరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో దాదాపు 2 వందల మందికి పైగా శాస్త్రవేత్తలు డబ్ల్యు హెచ్ ఓ కు లేఖలు కూడా రాశారు.అయితే ప్రచారాలపై డబ్ల్యు హెచ్ ఓ క్లారిటీ ఇచ్చింది.

గాలి ద్వారా కూడా కరోనా,క్లారిటీ ఇచ్చిన డబ్ల్యు హెచ్ ఓ-General-Telugu-Telugu Tollywood Photo Image

పరిశీలన తరువాత అర్ధమైన విషయాల గురించి ఆ సంస్థ స్పష్టత ఇచ్చింది.గాలి ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది అన్న విషయం అంగీకరించిన ఆ సంస్థ అయితే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఈ వైరస్ వ్యాప్తి అనేది ఉంటుంది అని స్పష్టం చేసింది.

అంటే రద్దీ ఎక్కువగా ఉండే ఇండోర్ ప్రదేశాలలో అలానే వెంటిలేషన్ సరిగా లేని ప్రదేశాల్లో ఈ వైరస్ గాలిద్వారా కూడా వ్యాపిస్తుంది అని తెలిపింది.

అయితే ఓపెన్ ఏరియాల్లో ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందడానికి అవకాశాలు చాలా తక్కువ అని ఆ సంస్థ తెలిపింది.

కేవలం అత్యవసర పరిస్థితుల్లో రోగులను వెంటిలేషన్‌పై ఉంచిన సందర్భాల్లోనే ఈ వైరస్ గాలి ద్వారా ఇతరులకు వ్యాప్తిస్తుంది అని వాదిస్తూ వచ్చిన WHO మరోసారి పునః పరిశీలించిన ఆ సంస్థ పై అభిప్రాయాలను వ్యక్తం చేసింది.

#WHO #Airborne Spread #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Who Coronavirus Airborne Spread Related Telugu News,Photos/Pics,Images..