మరో ఏడాది పోరాటం తప్పదంటూ WHO వార్నింగ్!

ఈ ఏడాది చివరి లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేస్తుంది అని అందరూ ఎదురుచూస్తుండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం మరో ఏడాది పాటు ఈ పోరాటం తప్పదంటూ మరోసారి ప్రపంచ దేశాలను హెచ్చరించింది.కరోనా మహమ్మారి తో ప్రపంచ దేశాలు అల్లాడుతున్న విషయం తెలిసిందే.

 మరో ఏడాది పోరాటం తప్పదంటూ Who వా-TeluguStop.com

రోజు రోజుకు కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతుండటం తో ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు అందరూ కూడా ఈ మహమ్మారికి మందు కనిపెట్టే పనిలో పడ్డారు.కొన్ని దేశాలు అయితే వ్యాక్సిన్ సిద్ధమైంది అని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తాం అంటూ ప్రకటించడం తో ఆ వార్త విన్న దేశాలు ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్నాయి.

అయితే ఇలాంటి సమయంలో WHO అంత ఈజీ గా వ్యాక్సినేషన్ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం చాలా కష్టమని కనీసం మరో ఏడాది వరకు ఈ పోరాటం తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మాత్రం మరో ఏడాది పాటు మహమ్మారి తో పోరాటం తప్పేలా లేదని WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామి నాథ్ వెల్లడించారు.

ఇప్పటికే చాలా దేశాలు క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసే స్థాయికి వచ్చినప్పటికీ అవి అందుబాటులోకి రావడానికి కనీసం ఈ ఏడాది చివరి వరకు టైం పడుతుంది అని, ఒకవేళ అవి వచ్చినా కోట్లాది మందికి ఈ వ్యాక్సిన్ పంపిణి చేయాలి అంటే మరింత సమయం పడుతుంది అందుకే మరో ఏడాది పాటు ఈ మహమ్మారితో యుద్ధం చేయాల్సిందే అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసులు కోటిన్నరకు పైగా నమోదు కాగా, ఆరు లక్షల మందికిపైగా ఈ మహమ్మారికి బలైన విషయం తెలిసిందే.

ఈ మహమ్మారికి ఎలాంటి మందు లేకపోవడం తో తీవ్ర స్థాయిలో మరణాలు చోటుచేసుకున్నాయి.అందుకే ప్రపంచ దేశాలు ఈ మహమ్మారికి వ్యాక్సిన్ ను కనుగొనే పనిలో నిమగ్నమయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube