ఆర్ఆర్ఆర్ రాజీనామా అస్త్రం ఎవరికి లాభం.. టీడీపీకా, బీజేపీకా..?

Who Benefits From Rrr Resignation

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే.ఆయనతో పాటు వైసీపీ పార్టీ కూడా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది.

 Who Benefits From Rrr Resignation-TeluguStop.com

సాధారణంగా అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుంటారు.ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలను వెనకేసుకొస్తుంటారు.

కానీ నర్సాపురం ఎంపీ అందుకు పూర్తి విరుద్ధం.ఈయన ఏకంగా తన పార్టీని, ముఖ్యమంత్రి జగన్‌ను టార్గెట్ చేశారు.

 Who Benefits From Rrr Resignation-ఆర్ఆర్ఆర్ రాజీనామా అస్త్రం ఎవరికి లాభం.. టీడీపీకా, బీజేపీకా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు.సీఎం జగన్‌ను మళ్లీ జైలుకు పంపించేందుకు ఏకంగా సీబీఐ అధికారులకు లేఖలు రాశారు.

తీరా వైసీపీ లీడర్ల సలహాతో జగన్ ఆర్ఆర్ఆర్‌ను సీబీఐ అధికారుల చేతనే అరెస్టు చేయించారు.

ఏపీలో ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మాత్రం వైసీపీని భారీ దెబ్బ తీయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆర్ఆర్ఆర్ కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలిసి కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని రాజుగారు చెప్పడంతో బీజేపీ పెద్దలు వద్దని సూచించారట.మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఉపఎన్నికలు అవసరమా? అని అన్నారట.ఇంకో నెలలో ఐదురాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి.ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం ప్రధానంగా యూపీ ఎన్నికలపై దృష్టిసారించింది.ఈ ఎన్నికలు బీజేపీకి డూ ఆర్ డై.రానున్న ఎన్నికల్లో యూపీలో గెలిస్తేనే 2024లో మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

అయితే, రాఘురామకృష్ణం రాజు మాత్రం రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం.కొందరు టీడీపీ నేతలు ఆ దిశగా ఆయన్ను ప్రోత్సహిస్తున్నారట.ఒకవేళ ఎంపీ రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేస్తే తప్పుకుండా గెలుస్తారని.అప్పుడు వైసీపీ కి పంచ్ పడుతుందని, దీంతో మరోసారి రాష్ట్రంలో టీడీపీ బలం పుంజుకునే అవకాశం ఉంటుందని, వైసీపీపై ప్రజా వ్యతిరేకత మొదలైందని తెలుగుదేశం పెద్దఎత్తున ప్రచారం చేయాలని భావిస్తోంది.

వారి మాటలు నమ్మి రఘురామ రాజీనామా చేసి బై పోల్‌కు తెరతీస్తే బీజేపీ టికెట్ పై ఆర్ఆర్ఆర్ గెలిచినా.బీజేపీ పొందాలనుకుంటున్న స్థానాన్ని మరోసారి టీడీపీ ఎగరేసుకుపోవడం ఖాయంగా తెలుస్తోంది.

Who Benefits From RRR Resignation TDP And BJP MP Raghu Rama Krishna Raju, Tdp, Bjp Party, Ysrcp , Elections - Telugu Bjp, Central, Mpraghu, Ys Jagan, Ysrcp

#Bjp #Ysrcp #YS Jagan #Central #MPRaghu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube