కేసీఆర్ ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్దులు వీరేనా ? 

ఇప్పటికీ తెలంగాణ శాసనమండలిలో ఏర్పడిన ఖాళీలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది.ఎమ్మెల్యే కోటా లో మొత్తం ఆరుగురిని ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉంది.

 Who Are The Mlc Candidates Selected By Cm Kcr Details,  Kcr, Telangana,hujurabad-TeluguStop.com

అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఉన్న మెజార్టీ దృష్ట్యా ఆ పార్టీకే ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశం ఉంది.అయితే టిఆర్ఎస్ నుంచి ఎవరిని ఎంపిక చేయాలని విషయంలోనూ  కెసిఆర్ ఎటూ తేల్చుకోలేక పోతున్నారు.

  దీనికి కారణం ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నవారందరికి గతంలో కెసిఆర్ ఎమ్మెల్సీ హామీ ఇవ్వడమే కారణం.ప్రస్తుతం ఎమ్మెల్యే కోటలో ఆరుగురిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

ఇక ఆ తరువాత స్థానిక సంస్థల ద్వారా మరో 12 ఖాళీలను భర్తీ చేసేందుకు అవకాశం ఉండటంతో దానికి సంబంధించిన జాబితా ఇప్పటికే కేసీఆర్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక స్థానిక సంస్థల ద్వారా అభ్యర్థుల పూర్తి వివరాలను ఈనెల 22వ తేదీన కేసీఆర్ స్వయంగా వెల్లడించబోతున్నారు.

రెండు దఫాలుగా జరగబోతున్న ఈ ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలనే దానిపై కేసీఆర్ లోతుగానే పరిశీలన చేసినట్లు సమాచారం.రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అభ్యర్థులను ఎంపిక చేసి వారి ద్వారా టిఆర్ఎస్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుని గెలవాలనే లక్ష్యంతో కెసిఆర్ ఉన్నారు.

తెలంగాణ అసెంబ్లీ లో ఉన్న 119 మంది ఎమ్మెల్యేల్లో 103 మంది టిఆర్ఎస్ కు చెందిన వారే.ఏడుగురు ఎం.ఐ.ఎం పార్టీకి చెందిన వారు ఉన్నారు.ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.వీళ్లల్లో  ఏడుగురు ఏం.ఐ.ఎం ఎమ్మెల్యేలను కలుపుకుంటే 110 మంది ఎమ్మెల్యేల మద్దతు టిఆర్ఎస్ కు లభిస్తుందనే లెక్కల్లో కెసిఆర్ ఉన్నారు.
 

Telugu Dubbaka, Hujurabad, Ramana, Mlc, Telangana, Trs Candis, Trs, Trsmlc-Telug

ఇక ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ కేసీఆర్ ఈ విధంగా డిసైడ్ చేశారట.
  1.ఎర్రోళ్ల శ్రీనివాస్, 2.మాజీ ఎంపీ సీతారాం నాయక్, 3.ఆకుల లలిత, 4.ఎం సి కోటిరెడ్డి, 5 మధుసూధనాచారి, 6.ఎల్ రమణ.
 

ఇక స్థానిక సంస్థల నుంచి టీఆర్ఎస్ తరపున ఎంపికయ్యే అభ్యర్థులు

  1.జూపల్లి కృష్ణారావు, 2.పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,3.  తేరా చిన్నపరెడ్డి, 4కల్వకుంట్ల కవిత, 5 కసిరెడ్డి నారాయణరెడ్డి , 6.శ్యంభి పూర్ రాజు, 7.భూపాల్ రెడ్డి, 8.కుచుకుళ్ దామోదర్ రెడ్డి , 9 కర్నే ప్రభాకర్, 10  బోడి కుంటి వెంకటేశ్వర్లు, 11.నేతి విద్యాసాగర్,.12.పాడి కౌశిక్ రెడ్డి  

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube