ఇప్పటివరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన మన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరంటే..!?

నిజానికి మద్యం సేవించి వాహనాలు నడపడం చాలా ప్రమాదకరం.మద్యం సేవించిన మత్తులో వాహనాలను నడపడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

 Who Are Our Tollywood Celebrities Found In Drunk And Drive So Far-TeluguStop.com

ఇది చట్టరిత్యా నేరం కూడా.డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను  అదుపులో ఉంచేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేయడంతో పాటు ప్రచారాలు చేస్తూ ఉండడం కూడా మనం చూస్తూనే ఉంటాం.

కానీ, పోలీసులు ఎన్ని సూచనలు ఇచ్చిన కానీ కొంత మంది మాత్రం  వారి పనితీరును మార్చుకోరు.మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ప్రముఖుల గురించి తెలుసుకుందామా.

 Who Are Our Tollywood Celebrities Found In Drunk And Drive So Far-ఇప్పటివరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన మన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ  లిస్టులో ముందుగా మాస్ హీరో రవితేజ సోదరుడు భరత్ ఒకరు.భరత్ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తూనే ఉండడం మనం చూసాం.ఆ మధ్య కాలంలో ఇండస్ట్రీలో డ్రగ్స్, ఆల్కహాల్ లాంటి  వ్యవహారాల్లో అతని పేరు ఎక్కువగా వినపడేది.ఇలాంటి వ్యవహారాల్లో అనేక  మార్లు ఆయన పోలీసులకు దొరికిపోయాడు.

 నవదీప్.ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ లో ప్రతి ఒకరికి తెలిసిన నటుడు.నవదీప్ ఒక పార్టీ కి వెళ్లి వస్తున్న సమయంలో.డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు.ఆ సమయంలో పోలీసులు నవదీప్ వాహనాన్ని స్వాధీనం చేసుకొని, కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

Telugu Bharath, Case, Drugs, Drunk And Drive, Kona Venkat, Navadeep, Nikil, Polices, Pradeep, Tollywood Celebrities-Latest News - Telugu

యూత్ లో క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకడు నిఖిల్.ఇతను కూడా 2011లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికిపోయాడు.నిఖిల్ ఒక రాత్రి అంతా పోలీస్ స్టేషన్ లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇక ఈ లిస్టులో తర్వాత ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే నటుడు శివ బాలాజీ.

ఈయన కూడా ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు.ఆ సమయంలో శివ బాలాజీ మీడియా పై ఫైర్ సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ డ్రంక్ అండ్ డ్రైవ్  లిస్టులో కోన వెంకట్, సాయి రోహిత్, బి.వి.ఎస్.రవి, రాజా రవీంద్ర, యాంకర్ ప్రదీప్ లు కూడా ఉన్నారు.

#Bharath #Nikil #Polices #Drunk And Drive #Navadeep

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు