టీఆర్ఎస్‌లో టికెట్ల పోటీ.. తెర‌పైకి ప‌లువురి పేర్లు?

ప్ర‌స్తుతం రాష్ట్ర‌మంతా హుజూరాబాద్ వైపే చూస్తోంది.అక్క‌డ జ‌రుగుతున్న‌రాజ‌కీయాలపైనే రాష్ట్ర పార్టీలు, అధ్య‌క్షులు ఫోక‌స్ పెడుతున్నారు.

 Who Are Contesting In Huzurabad Constituency From Trs Against Etela Rajender-TeluguStop.com

ఈట‌ల రాజేంద‌ర్ ఈ రోజు రాజీనామా చేయ‌నున్నారు.దీంతో అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌పై ఇప్ప‌టికే తీవ్ర పోటీ నెల‌కొంది.

ఇక అధికార టీఆర్ఎస్‌లో అయితే మాకంటే మాకంటూ విప‌రీత‌మైన ఒత్తిడిలు వ‌స్తున్నాయి.ఈట‌ల త‌ర్వాత స్ప‌ష్ట‌మైన నాయ‌కుడు టీఆర్ ఎస్‌కు అక్క‌డ లేక‌పోవ‌డంతో అంద‌రూ ముందుకొస్తున్నారు.

 Who Are Contesting In Huzurabad Constituency From Trs Against Etela Rajender-టీఆర్ఎస్‌లో టికెట్ల పోటీ.. తెర‌పైకి ప‌లువురి పేర్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో అస‌లు టికెట్ ఎవ‌రికి ఇవ్వాలో అర్థం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు నేత‌లు.ముఖ్యంగా మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పేరు బ‌లంగా వినిపిస్తోంది.ఆయ‌న త‌ర్వాత‌ కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ఫ్యామిలీ నుంచి ఎవ‌రైనా బ‌రిలోకి దిగుతారంటూ ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది.అలాగే మాజీ బీసీ క‌మిష‌న్ స‌భ్యుడు వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్‌రావు, అలాగే ప్ర‌స్తుత టీఆర్ ఎస్వీ రాష్ట్ర అధ్య‌క్షుడు గెల్లు శ్రీనివాస్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

కాక‌పోతే వీరిలో మాజీ ఎంపీ వినోద్‌, కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు పేర్లు ఎక్కువ‌గా ప‌రిశీల‌నలోకి వ‌స్తున్నాయి.

Telugu @cm_kcr, Bjp And Trs, Captain Lakshmi Kantha Rao, Congress Ktr, Gellu Srinivas, Huzurabad Constituency, Koushik, Mp Vinod, Trs Party Huzurabad Trs Ticket-Telugu Political News

ఇదిలా ఉండగా నిన్న కేటీఆర్‌ను కాంగ్రెస్ ఇన్‌చార్జి అయిన పాడి కౌశిక్‌రెడ్డి క‌ల‌వ‌డం క‌ల‌క‌లం రేపింది.ఆయ‌న కూడా టీఆర్ ఎస్‌నుంచే పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటూ వార్తలు వ‌స్తున్నాయి.అయితే దీనిపై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త రానుంది.

గ‌త ఎన్నిక‌ల్లో కౌశిక్‌రెడ్డి బాగానే పోటీ ఇచ్చాడు.ఇంకోవైపు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డికి ద‌గ్గ‌రి బంధువుకావ‌డంతో కేటీఆర్ కూడా ఆస‌క్తి చూపుతున్న‌ట్టు స‌మాచారం.

కానీ ఈట‌ల బీసీ కావ‌డంతో ఆయ‌న‌పై బీసీ నేత‌నే పోటీకి దింపే ఛాన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.అప్పుడే ప్ర‌జ‌ల్లో సానుభూతి వ‌స్తుంద‌ని టీఆర్ ఎస్ అధిష్టానం భావిస్తోంది.

అందుకే వినోద్‌, కెప్టెన్ కుటుంబీకుల్లో ఎవ‌రికో ఒక‌రికి ఛాన్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంది.చూడాలి మ‌రి వీరిలో ఎవ‌రికి టికెట్ వ‌రిస్తుందో చూడాలి.

#BJP And TRS #Congress Ktr #Gellu Srinivas #Mp Vinod #@CM_KCR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు