ఒకే ఒక్క నిమిషం నిమ్మరసంతో ఇలా చేస్తే పంటి మీద గార మాయం  

Teeth Whitening, Teeth,Healthy Tooth, Lemon Juice, ENO -

ఈ రోజుల్లో టీ,కాఫీ,కిళ్ళీ,గుట్కా వంటివి నమలటం ఎక్కువ అయ్యిపోయింది.దాంతో దంతాలు పచ్చగా గార పట్టటం మరియు చిగుళ్లు అనారోగ్యానికి గురి కావటం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంది.

 Whiten Your Teeth In 1 Minute

ప్రతి రోజు బ్రష్ చేసిన ఈ గార పోదు.అలాగే ఎన్ని రకాల టూత్ పేస్ట్ లను ఉపయోగించిన ఎటువంటి ఫలితం ఉండదు.

పంటి మీద గారను దంత సమస్యలను సులువుగా వదిలించుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
పసుపు గార పట్టిన దంతాలు తెల్లగా మారటానికి ENO చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.ఎందుకంటే ENO లో బేకింగ్ సోడా ఎక్కువగా ఉండుట వలన దంతాలు తెల్లగా అవ్వటానికి సహాయపడుతుంది.

ఒకే ఒక్క నిమిషం నిమ్మరసంతో ఇలా చేస్తే పంటి మీద గార మాయం-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

ఈ చిట్కా కోసం ఒక ENO పేకెట్,అర నిమ్మ చెక్క అవసరం అవుతాయి .ఒక బౌల్ లోENO పౌడర్ వేసి దానిలో నిమ్మరసం వేసి బాగా కలపాలి.ఈ పేస్ట్ ని బ్రష్ సాయంతో పళ్ళ మీద రుద్దాలి.ఇలా రెండు నిముషాలు అయ్యాక నోటిని శుభ్రంగా కడుక్కోవాలి.వారానికి రెండు నుంచి మూడు సార్లు చేస్తే పంటి మీద పసుపు పచ్చని గార తొలగిపోతుంది.ENO నోటిలో ఉన్న బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

అలాగే దంతాలను బాలంగా ఉండేలా చేస్తుంది.అంతేకాకుండా పిప్పి పండ్ల సమస్య నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.

మన వంటగదిలో సులభంగా దొరికే పదార్ధాలతో కూడా పసుపు గార పట్టిన దంతాలను తెల్లగా మెరిసేలా చేయవచ్చు.ఎలాగో తెలుసుకుందాం.దీనికి నిమ్మరసం,ఉప్పు,పసుపు అవసరం అవుతాయి.నిమ్మకాయను సగానికి కోసి నిమ్మచెక్క మీద ఉప్పు మరియు పసుపు వేసి దంతాలను రుద్దాలి.

ఈ విధంగా చేస్తే కొన్ని నిమిషాల్లోనే మంచి ఫలితం కలుగుతుంది.
టూత్ పేస్ట్ మీద ఉప్పు జల్లి బ్రష్ చేస్తే పంటి మీద గార పోవటమే కాకుండా నోటిలో బ్యాక్టీరియా కూడా చనిపోతుంది.

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయాలి.ఈ విధంగా చేస్తూ ఉంటె పంటి మీద గార,పంటి సమస్యలు తగ్గిపోతాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Whiten Your Teeth In 1 Minute Related Telugu News,Photos/Pics,Images..