18 నెలల్లో వెయ్యి కోట్లు సంపాదించాడు.. ఎలానో తెలుసా.?!

డబ్బు సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.కొందరు కష్టంతో డబ్బులు సంపాదిస్తారు.

 Karan Bajaj,corporate Executive, Novelist, Monk,baijus,computer Coding,white Hat-TeluguStop.com

మరికొందరు తెలివితేటలతో డబ్బులు సంపాదిస్తారు.కానీ ఎంత కష్టపడినా కేవలం అతి తక్కువ కాలంలోనే కోట్లు సంపాదించడం అంటే ఎంతో అసాధ్యం తో కూడుకున్న పని.కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తన తెలివితేటలతో అందరిని ఆశ్చర్యపరిచాడు.కేవలం 18 నెలల కాలంలో వెయ్యి కోట్లు సంపాదించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.

అయితే అతను ఎవరు? ఎలా సంపాదించాడు? వంటి విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…

కరణ్ బజాజ్ అనే వ్యక్తి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్, నవలా రచయిత, సన్యాసి, యోగిగా, ఒక పారిశ్రామికవేత్తగా ఎన్ని అవతారాలు ఎత్తి చివరి ప్రయత్నంగా ఓ స్టార్టప్ ను ప్రారంభించాడు.ఈ స్టార్ట్ ప్ మొదట్లో పెద్దగా కలిసి రాకపోయినా మెల్ల మెల్లగా అభివృద్ధిని పుంజుకుంది.కేవలం 18 నెలల సమయంలోనే దీనికి 2200 కోట్ల రూపాయల విలువ కల్పించి ఈ స్టార్టప్ ను అమ్మేశారు…

Telugu Baijus, Karan Bajaj, Monk, Novelist, Whitehat-Latest News - Telugu

ఇందులో భాగంగా పిల్లలకు కంప్యూటర్ కోడింగ్ ను ఆటల రూపంలో నేర్పించే సమస్థ.ఇలాంటి శిక్షణ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేదు అని తెలిసి ఈ శిక్షణను ప్రారంభించాడు.ఈ శిక్షణ ఇవ్వడానికి కేవలం మహిళల్ని మాత్రమే టీచర్లుగా ఎంపిక చేశాడు.కేవలం పదిమంది టీచర్లతో 2018 లో ప్రారంభించిన ఈ సంస్థ మొదట్లో మంచి స్పందన రాలేదు.

కానీ మెల్ల మెల్లగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన రావడంతో టీచర్ల సంఖ్యను ఒకేసారి నాలుగు వందలకు పెంచారు.

Telugu Baijus, Karan Bajaj, Monk, Novelist, Whitehat-Latest News - Telugu

అమెరికాలోనూ ఈ శిక్షణలను ప్రారంభించిన వీరి రెవెన్యూ 10 కోట్ల నుంచి 100 కోట్ల మైలురాయిని దాటింది.దీంతో బైజుస్ ఈ సంస్థను కొనడానికి ముందుకు వచ్చింది 18 నెలల్లో స్థాపించిన ఈ సంస్థ దాదాపు 2,200 కోట్ల రూపాయలు పెట్టి కొనడానికి ముందుకు వచ్చింది.అతి తక్కువ సమయంలోనే స్థాపించిన ఈ సంస్థకు పెద్ద డిమాండ్ రావడం పెద్ద రికార్డు గా మిగిలిపోయింది.

కరణ్ బజాజ్ ఈ సమస్తను బైజూస్ కి అమ్మినా అందులో ప్రస్తుతం సీఈఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.ఈ సంస్థలు మరికొంతమందికి దగ్గర చేర్చే దిశగా, టీచర్ల సంఖ్యను లక్ష మందికి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కరుణ్ బజాజ్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube