చక్కెర బ‌దులు వీటిని తీసుకుంటే.. అధిక బ‌రువుకు చెక్ పెట్ట‌వ‌చ్చు!

చ‌క్కెర‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దీని వాడ‌కం అత్య‌ధికంగా ఉంది అన‌డంలో సందేహ‌మే లేదు.

 White Sugar Alternatives Here-TeluguStop.com

దాదాపు తొంబై శాతం మంది ఇళ్ల‌ల్లో ప్ర‌తి రోజు చ‌క్కెర‌ను ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటారు.పాలల్లోనో, కాఫీలోనో, టీలోనో చక్కెర కలుపుకొని తాగడంతోనే చాలా మంది రోజు ప్రారంభం అవుతుంది.

కానీ, చ‌క్కెర ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు అన్న సంగ‌తి అంద‌ర‌కీ తెలుసు.చ‌క్కెరను అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చే ప్ర‌ధాన స‌మ‌స్య అధిక బ‌రువు.

 White Sugar Alternatives Here-చక్కెర బ‌దులు వీటిని తీసుకుంటే.. అధిక బ‌రువుకు చెక్ పెట్ట‌వ‌చ్చు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ అధిక బ‌రువు కార‌ణంగా మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు ఇలా అనేక స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి.

అందుకే చ‌క్కెర‌కు దూరంగా ఉండాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

అయితే చ‌క్కెర మానేస్తే ఎలా అని చాలా మంది భావిస్తుంటారు.కానీ, చ‌క్కెర‌కు బ‌దులుగా ఇప్పుడు చెప్ప‌బోయేవి తీసుకుంటే అధిక బ‌రువు చెక్ పెట్ట‌డంతో పాటు మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొందొచ్చు.

మామూలు షుగ‌ర్‌కు ప్రత్యామ్నాయంగా బ్రౌన్ షుగర్ వాడ‌టం ఆరోగ్యానికి చాలా మంచిది. తెల్లని పంచదార కన్నా బ్రౌన్ షుగ‌ర్‌లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి.

బ్రౌన్ షుగ‌ర్ తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచే స‌హాజంగా శ‌క్తిని అందిస్తుంది.మ‌రియు జీర్ణక్రియ‌ను కూడా వేగ‌వంతం చేస్తుంది.అలాగే చ‌క్కెర‌కు బ‌దులుగా ఖర్జూరం షుగర్‌ను కూడా విన‌యోగించ‌వ‌చ్చు.ఎండు ఖర్జూరాలతో త‌యారు చేసే ఈ షుగ‌ర్ బ‌రువు త‌గ్గించ‌డంతో బాగా స‌హాయ‌ప‌డుతుంది.స్వీట్ల త‌యారీలో, టీ, కాఫీల్లో కూడా ఈ ఖ‌ర్జూరం షుగ‌ర్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు.

అదేవిధంగా, చ‌క్కెర క‌న్నా మాప్లే సిరఫ్ వాడ‌టం చాలా మంది.

మాప్లే సిరఫ్ వాడ‌డం వ‌ల్ల మ‌ధుమేహం కంట్రోల్ అవ్వ‌డంతో పాటు బ‌రువును కూడా త‌గ్గిస్తుంది.కాబ‌ట్టి, తెల్ల చ‌క్కెర బ‌దులు మాప్లే సిరఫ్ వినియోగించండి.

ఇక వీటితో పాటు షుగ‌ర్‌కు ప్రత్యామ్నాయంగా తేనె, బెల్లం, పండ్ల రసాలు, కోకోనట్ షుగర్ ఇలాంటివి వినియోగించే మంచిదేన‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

#Heavy Weight #White Sugar #Good Health #WhiteSugar #EffectsOf

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు